Begin typing your search above and press return to search.
పెద్దాయన హత్యోదంతాన్ని కెలికే దమ్ముందా?
By: Tupaki Desk | 3 Nov 2019 11:26 AM GMT`కమ్మరాజ్యంలో కడపరెడ్లు` చిత్రంతో రాంగోపాల్ వర్మ సెన్సేషన్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ తోనే క్లీన్ గా తానేం చూపించబోతున్నాడో చెప్పేశాడు. వైకాపా అధినాయకుడిపై తేదేపా నాయకులు ఆగడాల్ని.. ఏపీ ప్రతి పక్షవిపక్షాల దుర్మార్గాన్ని తెరపైకి తెస్తున్నాడు. రెండు అగ్ర కులాల మధ్యలో రావణ కాష్టం రగిలిస్తున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఏ పాల్ పాత్రలని కామిక్ గా చూపించబోతున్నాడని ట్రైలర్ లోనే రివీల్ చేసాడు. ఇంత వరకూ బాగానే ఉంది.
మరి వర్తమాన రాజకీయాలపై సినిమా చేస్తోన్న వర్మకు వైకాపా నేత.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వై.ఎస్ వివేకానందరెడ్డి హ్యతను కెలికే సాహసం చేసాడా? అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. వివేకా హత్య తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలన సృష్టించిందే తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం పాక్షికంగా అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటన ఇది. అత్యంత కర్కశంగా వివేకాని కత్తితో పొడిచి చంపారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అజలడి మొదలైంది. హత్య వెనుక కారణాల అన్వేషణ నేపథ్యంలో రకరకాల రుమార్లు..ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
అధికార ప్రభుత్వం ప్రతిపక్షంపై... ప్రభుత్వంపై ప్రతిపక్షం డైరెక్టుగా నాయకుల పేర్లు పెట్టి మరీ ఆరోపణలు గుప్పించుకోవడం సంచలనమైంది. మరి ఇలాంటి సన్నివేశాలను వర్మ ఈ సినిమాలో చూపిస్తున్నాడా? లేక వివేవా హత్య టాపిక్ ని వర్మ లైట్ తీస్కున్నాడా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకూ ఏ ప్రోమోలోను వర్మ ఈ విషయాన్ని వెల్లడించలేదు. అయితే కొందరు వివేకా హత్య జోలికి వర్మ వెళ్లి ఉండడనే భావిస్తున్నారు. మరి ఈ సందేహాలకు వర్మ ఏమని సమాధానం ఇస్తాడో?