Begin typing your search above and press return to search.

వర్మ నాస్తికుడా.? ఆస్తికుడా చెప్పేశాడు..

By:  Tupaki Desk   |   21 Oct 2018 10:50 AM GMT
వర్మ నాస్తికుడా.? ఆస్తికుడా చెప్పేశాడు..
X
రాంగోపాల్ వర్మ.. వివాదాస్పద దర్శకుడు.. తాను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి గుడిలోకి అడుగుపెట్టలేదని చెప్పే వర్మ సడన్ గా తిరుమల శ్రీవారిని లక్ష్మీపార్వతితో కలిసి దర్శించుకోవడం సంచలనం రేపింది. పక్కా నాస్తికుడిని దేవుడుని నమ్మను అని చెప్పే వర్మనే తిరుమలేషుడిని దర్శించుకున్నాడని తెలిసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇదే ప్రశ్నను తాజాగా రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో ఎదుర్కొన్నారు. దీనికి వర్మ చాలా ఆసక్తికర సమాధానం చెప్పాడు..

వర్మ ఎప్పుడూ దేవుడిని తిట్టలేదని.. దేవుడిపై భారం వేసే భక్తులను, భక్తిని మాత్రమే తిట్టానని తాజాగా చెప్పుకొచ్చాడు. ప్రపంచం మొత్తం నడిపించే దేవుడు లేడని చెప్పే మూర్ఖుడిని తాను కాదని.. అయితే తాను మాత్రం దేవుడిని నమ్మనని స్పష్టం చేశారు.

తనకు ఫ్లాపులు వస్తున్నాయని తిరుమలేషుడిని దర్శించుకోలేదని.. శివ, రంగీలా వంటి హిట్స్ వచ్చినప్పుడు కూడా తాను దేవుడిని నమ్మలేదని వర్మ క్లారిటీ ఇచ్చాడు. కేవలం తాను తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ కోసమే తాను తిరుమల దర్శించుకొని పలు విశేషాలు తెలుసుకున్నానని, తిరుమలకు సంబంధించిన నేపథ్యాన్ని సినిమాలో చూపించబోతున్నానని వర్మ క్లారిటీ ఇచ్చాడు.