Begin typing your search above and press return to search.
వర్మ.. ఇంత వేగంగా ఎలా?
By: Tupaki Desk | 27 Nov 2018 11:37 AM GMTరామ్ గోపాల్ వర్మ ఎప్పుడు సినిమా మొదలు పెడతాడో.. ఎప్పుడో పూర్తి చేస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. చడీచప్పుడు లేకుండా సినిమాలు తీసేయడం.. విడుదలకు సిద్ధం చేయడం వర్మ స్టైల్. ‘ఆఫీసర్’తో గట్టి ఎదురు దెబ్బ తిన్నాక ఆయన జోరు కొంచెం తగ్గినట్లు అనిపించింది. కొన్నాళ్లు డైరెక్షన్ కు దూరంగా ఉన్నాడాయన. కానీ ఇటీవలే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించాడు వర్మ. ఐతే ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక అంత సులువు కాదు కాబట్టి షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతుందని అనుకున్నారు. కానీ తన సినమాల్లో పాత్రలకు కాస్టింగ్ సెట్ చేయడంలో గొప్ప నైపుణ్యం ఉన్న ఆర్జీవీ.. ఆ పనిని సులువుగానే పూర్తి చేసేశాడట. అన్ని పాత్రలకూ నటీనటుల్ని ఫిక్స్ చేసి సైలెంటుగా షూటింగ్ మొదలుపెట్టేశాడట.
ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా ముగిసినట్లు వర్మ ప్రకటించాడు. ఆ మధ్య చంద్రబాబు పోలికలతో ఉన్న ఒక హోటల్ సర్వర్ ను చూసి ఫిదా అయిపోయి తన సినిమాలో బాబు పాత్రకు అతడినే తీసుకోవడానికి వర్మ ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి అతడితో టచ్ లోకి వెళ్లాడు. కానీ అతడినే సినిమాకు ఎంపిక చేశాడా లేదా అన్నది తెలియదు. మరోవైపు ఎన్టీఆర్ పోలికలతో ఉన్న వ్యక్తిని పట్టిస్తే పది లక్షల బహుమతి అన్నాడు. తర్వాత దీని గురించి అప్ డేట్ ఏమీ ఇవ్వలేదు. మరి ఇంత తక్కువ వ్యవధిలో సినిమాలో అన్ని పాత్రలకూ అందరూ కొత్త వాళ్లనే ఎలా ఎంపిక చేసుకున్నాడు. వాళ్లకు ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు. మేకోవర్ సంగతేంటి.. ఇంతలో చిత్రీకరణ ఎలా సాధ్యం అన్నది అంతుబట్టని విషయాలే. ఐతే ఇలాంటి వాటిలో వర్మ ఆరితేరిపోయాడు. ఎటొచ్చీ సినిమా సరిగా తీస్తాడా లేదా అన్నదే డౌటు. కొన్నేళ్లుగా వర్మ సినిమాల్లో అదనపు ఆకర్షణలు బాగానే ఉంటున్నాయి. సినిమాలే బాగుండట్లేదు.