Begin typing your search above and press return to search.
‘ఆఫీసర్’ ప్రాబ్లెం ఏంటో వర్మకు అర్థమైందా?
By: Tupaki Desk | 5 Jun 2018 3:30 PM GMTఅక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కలయికలో వచ్చిన కొత్త సినిమా ‘ఆఫీసర్’ గురించి గత మూడు నాలుగు రోజులుగా ఎలాంటి వార్తలొస్తున్నాయో తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలోనే ఓ పెద్ద హీరో సినిమాకు ఇంత దారుణమైన వసూళ్లు ఎప్పుడూ వచ్చింది లేదు. రెండో రోజు నుంచే థియేటర్లు ఖాళీ అయిపోయి.. థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రావట్లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లలో వర్మ ట్రాక్ రికార్డు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ ఈ చిత్రంలో నాగార్జున నటించాడు కాబట్టి పరిస్థితి మెరుగ్గానే ఉంటుందని.. ఇది ప్రేక్షకుల దృష్టిని ఎంతో కొంత ఆకర్షిస్తుందని ఆశించారు. కానీ ప్రేక్షకులు దిమ్మదిరిగే షాకిచ్చారు చిత్ర బృందానికి. పరిస్థితి చూసి నాగార్జున కచ్చితంగా షాకై ఉంటాడు. వర్మతో పని చేయాలన్న తన నిర్ణయంపై చింతిస్తుంటాడు.
నిజానికి వర్మ గత దశాబ్ద కాలంలో వర్మ తీసిన చాలా సినిమాల కంటే ‘ఆఫీసర్’ బెటర్ గానే ఉంటుంది. ఈ వసూళ్లను బట్టి మరీ చెత్త సినిమా అని దీన్ని తేల్చేయలేం. కేవలం సినిమా చెత్తగా ఉండటం వల్లే దీనికి ఇలాంటి వసూళ్లు వస్తున్నాయని తీర్మానించలేం. దర్శకుడిగా కంటే వ్యక్తిగా వర్మ పతనం ఈ సినిమాకు ఎక్కువ చేటు చేసిందని చెప్పాలి. ఒకప్పుడు సైలెంటుగా తన పని తాను చేసుకుపోతూ క్లాసిక్స్ తీసిన వర్మ.. ఆ తర్వాత పని తగ్గించేసి మాటల్లోకి దిగాడు. సోషల్ మీడియాలో కూర్చుని ఎవరినో ఒకరిని గిచ్చడం.. సెటైర్లు వేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఐతే ఒక దశ వరకు అదంతా సరదాగానే అనిపించింది. కానీ తర్వాత అతను శ్రుతి మించిపోయాడు. కొందరిని అదే పనిగా టార్గెట్ చేసుకున్నాడు. ఇక్కడి నుంచే ఆయనపై వ్యతిరేకత మొదలైంది.
ఐతే ఆయన ఎన్ని తప్పులు చేసినా చెల్లిపోయింది కానీ.. పవన్ కళ్యాణ్ మీదికి శ్రీరెడ్డిని ఉసిగొల్పడంతో కథ అడ్డం తిరిగింది. ఆయన్ని అప్పటిదాకా అభిమానిస్తున్న వాళ్లు కూడా వ్యతిరేకంగా తయారయ్యారు. ‘జీఎస్టీ’ విషయంలో చేసిన అతి కూడా వర్మను దిగజార్చేసింది. దెబ్బకు వర్మ మీద వ్యతిరేకత పతాక స్థాయికి చేరి.. ఆ ప్రభావమంతా ‘ఆఫీసర్’పై పడింది. ఇన్నాళ్లూ వర్మ జనాల బలహీనతలతో ఆడుకునేవాడు. ఏదో ఒక కాంట్రవర్శీ క్రియేట్ చేసి దాన్నే సినిమా ప్రచారానికి ఉపయోగించుకునేవాడు. జనాల్ని థియేటర్లకు రప్పించగలిగేవాడు. కానీ ఈసారి అలా జరగలేదు. వర్మను ఇగ్నోర్ చేయడమే ఆయనకు వేసే పెద్ద శిక్ష అని జనాలకు అర్థమైపోయింది. ఆయన్ని అటు సోషల్ మీడియాలోనే కాకీ.. ఇటు సినిమా పరంగా కూడా ఇగ్నోర్ చేశారు. ‘ఆఫీసర్’ను అసలు పట్టించుకోవడం మానేశారు. దీంతో పంచ్ గట్టిగా తాకేసింది. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న తప్పులకు ఒక్కసారిగా ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు వర్మ. ఈ సినిమా రిజల్ట్ చూశాక వర్మ ఇంకో సినిమా తీసే సాహసం చేస్తాడా అన్నది డౌటే.