Begin typing your search above and press return to search.

పవన్ కంటే 10 రెట్లు బెటర్

By:  Tupaki Desk   |   28 Aug 2017 5:27 PM GMT
పవన్ కంటే 10 రెట్లు బెటర్
X
కాంట్రవర్సియల్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంలో ఎవరైనా సరే రామ్ గోపాల్ వర్మ తర్వాతే అనడంలో డౌట్ ఏమీ ఉండదు. కొంతకాలం క్రితం వరకూ ట్విట్టర్ లో మెగా ఫ్యామిలీపై నానా రచ్చా చేసి చివరకు అది వదిలేసి ఇన్ స్టాగ్రామ్.. ఫేస్ బుక్ లను తగులుకున్న వర్మ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకున్నాడు. మరి మెగా హీరోలను కదిపేందుకు ఏదో ఒక ఆయుధం కావాలి కదా.. ఇప్పుడా లింక్ అర్జున్ రెడ్డి రూపంలో వర్మకు దొరికింది.

"అర్జున్ రెడ్డి లాంటి క్వాలిటీ మూవీ అందించినందుకు విజయ్.. సందీప్ లకు ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పాలి. స్టాండర్డ్ లేని సినిమాలు.. ఫార్ములా కథలు అవసరం లేదని జనాలు ప్రూవ్ చేశారు" అన్నాడు వర్మ. ఇంతవరకే కామెంట్ అయితే అది వర్మ మార్క్ అవదు కదా. "ఒక్క లైన్‌ లో పోలిక చెప్పాలంటే.. లుక్స్- స్టార్ చరిష్మా విషయంలో పవన్ కళ్యాణ్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇక పెర్ఫామెన్స్ అయితే పవన్ కళ్యాణ్ కు 20 రెట్లు అని చెప్పాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండకు రియల్ పవర్ స్టార్ అనే బిరుదు ఇవ్వాల్సిందే" అంటూ ఓ పద్ద లెటర్ రాసేశాడు రామ్ గోపాల్ వర్మ.

ఓ కొత్త తరం.. కొత్తరకంగా సినిమా అందించినందుకు సీనియర్ దర్శకుడిగా.. ట్రెండ్ సెట్టర్ గా గుర్తింపు పొందిన వర్మ ప్రశంసలు కురిపించడంలో ఏ మాత్రం తప్పులేదు. అయితే.. ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే జనాల్లో ఉండే అంతో ఇంతో ఆసక్తిని ఏళ్ల తరబడి తాను నీరు గారుస్తున్న విషయాన్ని వర్మ కంప్లీట్ గా మర్చిపోయాడు. ఇలా కొత్త రకంగా సినిమా ఏదైనా అందిస్తాడనే కదా ఆయన ఫాలోయర్స్ కోరుకుంటారు. నెక్ట్స్ జెన్ మూవీ వస్తే ఆ తరహాగా ఆలోచించడం మానేసి.. దాన్ని కూడా పనికి మాలిన పోలికలకు ఉపయోగించుకుంటున్నాడంటే.. వర్మ క్రియేటివిటీ కంప్లీట్ గా అడుగంటినట్లే అనుకోవచ్చంటారా?