Begin typing your search above and press return to search.

సెన్సారోళ్లను ఆటాడేసుకున్న వర్మ

By:  Tupaki Desk   |   19 Nov 2015 7:30 AM GMT
సెన్సారోళ్లను ఆటాడేసుకున్న వర్మ
X
పోర్న్ సినిమాల్ని బ్యాన్ చేయడంపైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డవాడు రామ్ గోపాల్ వర్మ. ఇక సినిమాల్లో ముద్దు సీన్ లను కట్ చేస్తే ఊరుకుంటాడా? సెన్సారోళ్లపై తనదైన శైలిలో చెలరేగిపోయాడు. జేమ్స్ బాండ్ కొత్త సినిమా ‘స్పెక్టర్’లో ముద్దు సీన్ లెంగ్త్ ఎక్కువైందని సగం కట్ చేయడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ముద్దు సీన్ తీస్తే పూర్తిగా తీయాలి కానీ ఇలా సగం కట్ చేయడం ఏంటంటూ సోషల్ మీడియాలో జనాలు సెన్సార్ వాళ్లను ఆటాడేసుకుంటున్నారు. ‘సంస్కారి జేమ్స్ బాండ్’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి జోకులు పేలుస్తున్నారు.

ఇక వర్మ లాంటోడికి ఇలాంటి టాపిక్ దొరికితే వదులుతాడా? ఇలాంటి పనులు చేయడం ద్వారా సెన్సార్ వాళ్లు మన ఆడియన్స్ ని జువైనల్ హోంలో వేలు చీక్కుంటూ కూర్చునే పిల్లల్లాగా అనిపిస్తున్నారని, తాము సెన్సార్ చేసే సినిమాల విషయంలో ఇలా చేసే అధికారులు.. తమ కుటుంబ సభ్యులు, తమ పిల్లల సెల్ ఫోన్లలో ఉన్నదాన్ని సెన్సార్ చేయగలరా అని ప్రశ్నించాడు వర్మ. ఓ ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగే వయసు వచ్చాక ఓ వ్యక్తి ఎలాంటి సినిమాలు చూడాలి, అందులో ఏం చూడాలి అన్న ఇంగితం లేకుండా ఉంటాడా అని అడిగాడు వర్మ. ప్రభుత్వాలు జనాల ఆలోచన స్థాయిని గౌరవించి.. ఇలాంటి సెన్సార్ కటింగులకు ముగింపు పలకాలని.. ఓ సినిమా చూడాలా వద్దా అన్నది జనాలే నిర్ణయించుకుంటారని వర్మ అన్నాడు.