Begin typing your search above and press return to search.
పవర్ అండ్ సెక్స్.. ఈ రెండే మూలం
By: Tupaki Desk | 27 May 2017 11:30 AM GMTతన కామెంట్లతో వివాదాల్లో ముందుండే రామ్ గోపాల్ వర్మ కొత్త టర్న్ తీసుకున్నాడు. తన కెరీర్ లో బ్రాండ్ న్యూ జర్నీ అంటూ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు. గన్స్ అండ్ థైస్ పేరిట వస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ నిన్న రిలీజ్ చేశాడు. తనకు అచ్చొచ్చిన.. అలవాటైన ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే ఈ వెబ్ సిరీస్ తీశాడు. సినిమాలు వదిలేసి ఈ వెబ్ సిరీస్ ఎందుకు తీసుకొచ్చాడో ట్విట్టర్ లో బోలెడు విశేషాలు చెప్పుకొచ్చాడు.
‘‘పవర్ అండ్ సెక్స్.. మనిషిలోని నేర ప్రవృత్తికి కానీ.. మనని పాలించే రాజకీయాలకు కానీ ఈ రెండే మూలం. అందుకే పవర్, సెక్స్ కు ప్రతీకగా ఉండేలా ఈ వెబ్ సిరీస్ కు గన్స్ అండ్ థైస్ పేరు పెట్టా. స్టోరీ టెల్లింగ్ లో వెబ్ సిరీస్ కు ఒక ప్రత్యేకమైన, విశేషమైన అవకాశముంది. టైం లిమిట్ అంటూ ఏమీ ఉండదు. సినిమాల్లో సెన్సార్ కత్తెర చెప్పనివ్వని ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పవచ్చు. సినిమాల్లోని క్యారెక్టర్స్ జీవితకాలం చాలా స్వల్పం. నిజ జీవితాల్లోని క్యారెక్టర్ల జీవితకాలం సుదీర్ఘం. వెబ్ సిరీస్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలదు. ముంబయి అండర్ వరల్డ్ కు చెందిన ఎన్నో నిజాలు ఈ వెబ్ సిరీస్ లో వెలుగులోకి వస్తాయి.’’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో తన అభిప్రయాలు నిక్కచ్చిగా చెప్పుకొచ్చాడు.
గన్స్ అండ్ థైస్ చూసిన వారికి సత్య, కంపెనీ సినిమాలు గుర్తు రావచ్చు. వాటిలోనూ మాఫియా గురించే చూపించామని అనుకోవచ్చు. కానీ ఆ సినిమాల్లో మాఫియాకు సంబంధించిన అంశాలను పైపైనే చూపించాను. అప్పుడు కొన్ని కారణాలతో చెప్పలేకపోయిన ఎన్నో విషయాలను ఈ వెబ్ సెరీస్ తో చెప్పబోతున్నాను అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. చూద్దాం... ఏం విషయాలు చెప్పబోతున్నాడో..
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/