Begin typing your search above and press return to search.
ఎవరిని టార్గెట్ చేశాడో అర్ధమైందా?
By: Tupaki Desk | 18 Sep 2016 7:49 AM GMTకరెంట్ ఇష్యూస్ పై ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉండడమే కాదు.. వాటిపై తన మార్క్ ఒపీనియన్స్ ను ఏ మాత్రం సందేహించకుండా చెప్పేయగలడు. పవన్ నుంచి ట్రంప్ వరకూ.. టీచర్స్ నుంచి స్టార్స్ వరకూ ఎవరూ వర్మ ఫోకస్ నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు వర్మ ట్విట్టర్ బర్డ్.. కత్రినా కైఫ్ వైపు తిరిగింది. రీసెంట్ గా కత్రినాకైఫ్ కు స్మితాపాటిల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. అయితే.. కేట్ కు ఈ అవార్డు ఇవ్వడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు.
కానీ వర్మ మాత్రం.. స్మితాపాటిల్ అవార్డును కత్రిన అందుకోవడంతో.. స్మితా పాటిల్ కే గౌరవం దక్కిందని అంటున్నాడు. ఇందుకు కారణం.. అల్రెడీ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉండి.. ట్రైనింగ్ అయిన స్మితా పాటిల్ కంటే.. యాక్టింగ్-డ్యాన్సులు-డైలాగ్స్ చెప్పడం రాని స్టేజ్ నుంచి అన్ని విభాగాల్లోనూ ట్యాలెంట్ చూపిస్తున్న కత్రిననే గ్రేట్ అంటున్నాడు వర్మ. హార్డ్ కోర్ ట్రైనింగ్ తీసుకుని ఎవరెస్ట్ ఎక్కడం కంటే.. నడవడం కూడా సరిగ్గా రానివాళ్లు ఎక్కడం గొప్ప కదా అన్నది వర్మ వెర్షన్.
'కత్రిన అవార్డు తీసుకోవడాన్ని విమర్శిస్తున్న వాళ్లలో 98.5 శాతం మంది జెలసీతోనే చేస్తుండగా.. మిగతావాళ్లకు వారేం మాట్లాడుతున్నారో వారికే తెలియదు' అంటున్నాడు వర్మ. ఇక్కడ వర్మ పంచ్ లు స్మితా పాటిల్ కి.. కత్రినకి కూడా తగిలినా.. అసలు టార్గెట్ మాత్రం కేట్ ని విమర్శించినవాళ్లే!