Begin typing your search above and press return to search.
చంపడం ఒక్కటే క్లిక్కవుతుందా బాసూ?
By: Tupaki Desk | 23 Nov 2015 4:23 AM GMTమూడు రాష్ర్టాల(ఏపీ - కర్నాటక - తమిళనాడు) పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగించిన స్మగ్లర్ వీరప్పన్ గురించి సినిమా తీస్తున్నారు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓ కాంట్రవర్శియల్ సబ్జెక్టును అంతే కాంట్రవర్శియల్ చేసి దాంతో ఉచిత ప్రచారం కొట్టేసి, సినిమాని మార్కెట్ చేసే సత్తా ఉన్న రామ్ గోపాల్ వర్మ వంటివాళ్లు ఇలాంటి సినిమా చేస్తున్నారు అంటే దానికి వచ్చే క్రేజు వేరేగా ఉంటుంది. కాని తీరా ఆ సినిమా యావత్ లైఫ్ స్టోరీ కాదు.. కేవలం చంపడం ఎలా అనే కాన్సెప్టుమాత్రమే టచ్ చేస్తున్నా అంటే.. అది కాస్త సందేహాత్మకంగా ఉంది మరి.
700 కోట్ల రూపాయలు ఖర్చు ... 20 ఏళ్ల డ్యూరేషన్ ..లో పోలీసులు నానా యాతన పడి స్మగ్లర్ వీరప్పన్ ని చంపారు. ఆపరేషన్ కుకూన్ పేరుతో 3 రాష్ర్టాల బార్డర్ లోని అడవుల్లో పెద్ద హంగామానే జరిగింది. ఏదైతేనేం వీరప్పన్ ని చంపడం అంతా డ్రమటిక్. ఆ డ్రామా ఎలా ఉంటుందో? ఇప్పుడు కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో చూపించేందుకు వర్మ రెడీ అవుతున్నాడు. వీరప్పన్ ను చంపడం అనే పాయింట్ తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశానని వర్మ చెబుతున్నాడు. సందీప్ భరద్వాజ్ టైటిల్ రోల్ పోషిస్తే .. అతడిని వెంటాడే పోలీస్ ఆఫీసర్ గా కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ నటించాడు.
బాగానే ఉంది కాని.. అసలు వీరప్పన్ ఎవరు, ఎందుకు అలా మారాడు అనే అంశాలే చాలా ఆసక్తి రేకిత్తిస్తాయి. కాని అలా కాకుండా కేవలం అతగాడిని చంపడం మీదనే ఫోకస్ చేశాను అంటే.. అసలు కిక్ రాదేమో. ఎందుకంటే అందరూ గుర్తుంచుకునేంత అతి పెద్ద కిల్లర్ వీరప్పన్ అనేది ఒకప్పుడు.. ఇప్పుడు టివి న్యూస్ పుణ్యమా ఇలాంటి కిల్లర్లను రోజుకొకరిని చూస్తున్నాం. సో.. వీరప్పన్ ఏమీ సచిన్ టెండుల్కర్ కాదు.. ఏదో ఒక్క ఘట్టం చూపించేసి ముగించేస్తా అంటే.. మరి చూద్దాం ''కిల్లింగ్ వీరప్పన్'' ఎలా ఉండబోతోందో. డిసెంబర్ 4న రిలీజ్ అనే విషయం తెలిసిందే.