Begin typing your search above and press return to search.
వర్మ అదరగొట్టి వెళ్లిపోనున్నాడా?!
By: Tupaki Desk | 29 Dec 2015 5:07 AM GMTముంబై పిలుస్తోంది... ఇక హైదరాబాద్ కి సెలవ్ అని ఈమధ్యే ట్విట్టర్ లో ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు వర్మ. అది చూసిన జనాలు ఒకొక్కరు ఒక్కోలా స్పందించారు. మెజారిటీ జనం వర్మ పీడ ఇరగడైపోయిందన్నట్టుగా ట్వీట్లు చేశారు. ఒకప్పుడు అద్భుతాలు సృష్టించిన వర్మ ఇటీవల రొటీన్ సినిమాలు చుట్టేస్తుండడమే జనం అలా స్పందించడానికి కారణం. తీసేది పరమ రొటీన్ సినిమానే అయినా వాటికి రకరకాల రూపాల్లో పబ్లిసిటీ చేసేస్తుంటాడు. దీంతో వర్మ ఇది బాగానే తీసున్నట్టున్నాడనుకొని ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లడం, మళ్లీ రొటీన్ సినిమానే తెరపై చూసి తిట్టుకొంటూ బయటికి రావడం పరిపాటిగా మారింది. చాలాకాలంగా ఇదే పరిస్థితి. కానీ ఈసారి కిల్లింగ్ వీరప్పన్ రూపంలో ఆయన స్టైల్ ఆఫ్ సినిమా రాబోతోందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.
ముంబై ఎటాక్స్ పై చేసిన చిత్రంలా కిల్లింగ్ వీరప్పన్ కోసం బోలెడంత రీసెర్చ్ చేసి సినిమా తీశాడు వర్మ. దీంతో సినిమా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ముంబై వెళుతూ వెళుతూ వర్మ ప్రేక్షకుల మనసు దోచుకొని వెళ్లిపోనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ట్రైలర్స్ కూడా అందుకు బలాన్నిచ్చేలాగే ఉన్నాయి. అద్భుతమైన షాట్ లు ఆ ట్రైలర్లలో కనిపిస్తున్నాయి. వాటిని చూసే అమితాబ్ - రితేశ్ దేశ్ ముఖ్ లాంటి ప్రముఖులు ట్వీట్లు చేశారు. ఎప్పట్లా ఏది పడితే అది చుట్టేయకుండా చాలా క్వాలిటీతో రిచ్ గా సినిమాని తీసినట్టు తెలుస్తోంది. వీరప్పన్ పోలీసులకు ఎలా దొరికాడన్న ఎపిసోడ్ ప్రేక్షకులకి అద్భుతమైన ఫీలింగ్ ని కలగజేస్తుందని సమాచారం. జనవరి 1న రానున్న ఈ చిత్రంపై వర్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాని మూడు రకాల ప్రేక్షకులు చూస్తారని ఆయన కుండ బద్దలు కొట్టి చెబుతున్నాడు.