Begin typing your search above and press return to search.

వర్మ ఎన్నిసార్లు క్లారిటీ ఇస్తాడో

By:  Tupaki Desk   |   18 Dec 2015 7:30 AM GMT
వర్మ ఎన్నిసార్లు క్లారిటీ ఇస్తాడో
X
వాళ్ల సినిమాలు.. వీళ్ల సినిమాల గురించి రామ్ గోపాల్ వర్మ ఏవేవో కామెంట్లు చేస్తాడు కానీ.. తన సినిమాల సంగతే పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడు. వర్మ తీసిన ఐదారు సినిమాలు విడుదలకు నోచుకోకుండా అలా పడి ఉన్నాయి. ఇందులో ఒక్కోటి క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేని పరిస్థితి. అన్నింట్లోకి ఎక్కువ క్రేజ్ ఉన్న ‘కిల్లింగ్ వీరప్పన్’ మూవీని కూడా రిలీజ్ చేసుకోలేకపోతున్నాడు. అన్ని ఇబ్బందులూ దాటుకుని ఈ నెల 4వ తారీఖున రిలీజ్ చేద్దామంటే వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి అడ్డం పడింది. ఆ తర్వాత అంతా క్లియర్ అయిపోయింది. 11న రిలీజ్ అన్నాడు. కానీ వెనక్కి తగ్గాడు.

18న రిలీజ్ పక్కా అని చెప్పాడు. ఆ డేటూ దాటిపోయాడు. ఇప్పుడిక మళ్లీ ‘కిల్లింగ్ వీరప్పన్’ రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చాడు వర్మ. ఈ సినిమా ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో పాటు అన్ని వివాదాలూ సమసిపోయాయని జనవరి 1న భారీ స్థాయిలో తెలుగు - కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ అవుతుందని వెల్లడించాడు. ఐతే అదే రోజు తెలుగులో రామ్ మూవీ ‘నేను శైలజ’తో పాటు నాగశౌర్య మూవీ ‘అబ్బాయితో అమ్మాయి’ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ముందు వారం మూణ్నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. మరి ఇన్ని సినిమాల మధ్య వర్మ మూవీకి ఏమాత్రం థియేటర్లు దొరుకుతాయో చూడాలి.