Begin typing your search above and press return to search.
వర్మ పరిస్థితి ఇలా అయ్యిందేంటి?
By: Tupaki Desk | 29 Nov 2015 1:30 PM GMT‘పట్టపగలు’ ల్యాబ్ లో భద్రంగా ఉంది. ‘సావిత్రి’గా మారిన ‘శ్రీదేవి’ సంగతి ఏమైందో తెలియదు. ‘సీక్రెట్’ సినిమా కూడా విడుదలకు నోచుకోకుండా అలా మూలన పడి ఉంది. ‘స్పాట్’ సంగతి ఏమైందో తెలియదు. ‘అటాక్’ కూడా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇదీ రామ్ గోపాల్ వర్మ సినిమాల పరిస్థితి. వీటి సంగతి వదిలేస్తే ‘కిల్లింగ్ వీరప్పన్’ అయినా విడుదలకు నోచుకుంటోందిలే అనుకుంటే దానికి లేనిపోని అడ్డంకులు వచ్చిపడ్డాయి. ఓ పక్క ఫైనాన్స్ ఇష్యూస్, మరోపక్క కోర్టు కేసుతో ఈ సినిమా విడుదల సందిగ్ధంలో పడిపోయింది.
డిసెంబరు 4న ఈ సినిమా విడుదల కావడం దాదాపుగా అసాధ్యం. అసలు ఈ నెలంతా కూడా సినిమా విడుదలయ్యే అవకాశాలే లేవంటున్నారు. ఈ సినిమాకు ఫైనాన్స్ గొడవలు కూడా ఉండటంతో రిలీజ్ కు ఇప్పుడిప్పుడే క్లియరెన్స్ రావడం కష్టమేనట. మరోవైపు వీరప్పన్ భార్య సినిమా విడుదలను ఆపేయాలంటూ వేసిన పిటిషన్ ను బెంగళూరు సిటీ కోర్టు మన్నిస్తూ రిలీజ్ మీద స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాలన్నీ క్లియర్ చేసుకోవడానికి వర్మకు చాలా టైమే పట్టేట్లుంది. లేక లేక తన సినిమాల్లో ఒకదానికి క్రేజ్ వచ్చి.. విడుదలకు నోచుకోబోతుంటే దానికిలా అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి. ఏంటో వర్మ పరిస్థితి ఇలా అయిపోయింది.