Begin typing your search above and press return to search.
చంపేస్తే యుట్యూబ్ లో పెట్టేస్తా!
By: Tupaki Desk | 9 March 2019 4:21 AM GMTఇప్పటి నుంచి వెనక్కు ఓ పదేళ్ళ కాలాన్ని తీసుకుంటే ఏ వర్మ సినిమాకు ఇంత బజ్ రాలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. నాగార్జున అంతటి స్టార్ హీరోతో ఆఫీసర్ చేస్తేనే దాన్ని అమ్మడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. కేవలం వర్మ దర్శకుడు అనే నెగటివ్ బ్రాండ్ దాని ప్రీ రిలీజ్ బిజినెస్ కు అడ్డంకిగా మారింది. ఇక దాని ఫలితం చూశాక ఏదో మూల ఉన్న ఒక్క శాతం నమ్మకం కూడా పూర్తిగా తుడిపించేసుకున్నాడు వర్మ. అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది.
ఆశించిన దాని కన్నా చాలా ఎక్కువ హైప్ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు వచ్చేసింది. కంటెంట్ సంగతి ఏమో కాని మొదటి రోజు హౌస్ ఫుల్స్ ఖాయమని ట్రేడ్ ఇప్పుడే చెబుతోంది. ముఖ్యంగా రెండు ట్రైలర్లు ఆకట్టుకునేలా కట్ చేయడంతో సామాన్య ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి నెలకొంది. అయితే మార్చ్ 22 అని డేట్ అయితే ప్రకటించారు కాని నిజంగా ఇది బయటికి వస్తుందా అధికార పార్టీ సిఎంని ప్రతికూలంగా చూపించిన కథ కాబట్టి అడ్డుకునే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయని టాక్ అయితే ఉంది
వర్మ దీనికి స్పష్టమైన సమాధానం ఇస్తున్నాడు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆపాలంటే తనను చంపడం ఒక్కటే మార్గమని కుండ బద్దలు కొట్టేశాడు. ఒకవేళ అదీ జరిగితే ఓ హార్డ్ డిస్క్ లో సినిమా మొత్తాన్ని అప్ లోడ్ చేశానని తాను చనిపోయిన వెంటనే దాన్ని యుట్యూబ్ లో ఫ్రీగా పెట్టేయమని యూనిట్ కి సూచనలు కూడా ఇచ్చేశానని క్లారిటీ ఇచ్చేశాడు.
ఒకవేళ చట్టపరంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలో ముందే న్యాయ నిపుణుల సలహా తీసుకునే రంగంలోకి దూకానని అన్నింటికీ సిద్ధపడే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశానని మరింత స్పష్టంగా తేల్చి చెప్పేశాడు. చంపడం లాంటివి ఊహాతీతమైన మాటలు వాటిని పక్కన పెట్టొచ్చు. కాని నిజంగా ఆపేస్తే ఫ్రీగా సినిమా చూపించేస్తా అంటున్నాడు కాబట్టి వర్మ ఫ్యాన్స్ మూవీ లవర్స్ నిశ్చింతగా ఉండొచ్చు. ఆగిపోయే దాకా వస్తే ఉచితంగా చూసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా దక్కుతుంది