Begin typing your search above and press return to search.

అది సన్నీ వల్లే సాధ్యమంటున్న వర్మ

By:  Tupaki Desk   |   3 March 2016 4:25 AM GMT
అది సన్నీ వల్లే సాధ్యమంటున్న వర్మ
X
నేనేం చేసినా.. ఏం మాట్లాడినా.. అదంతా పబ్లిసిటీ కోసమే అంటాడు రామ్ గోపాల్ వర్మ. అలాగని ఆయన్ని వదిలేయగలమా..? వదిలేయలేం. వర్మ రాజేసే నిప్పు తాలూకు సెగ అలా ఉంటుంది మరి. దాన్ని ఎవ్వరూ విస్మరించలేరు. కొన్ని రోజలుగా ‘వంగవీటి’ సినిమాకు సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచిన వర్మ.. ఇప్పుడు మళ్లీ తన ఫోకస్ వేరే టాపిక్ మీదికి మళ్లించాడు. ఆయన దృష్టి శృంగార తార సన్నీ లియోన్ మీదికి మళ్లింది. మన దేశంలో చైతన్యం రావాలంటే అది సన్నీ లియోన్ వల్లే సాధ్యం అంటున్నాడు వర్మ. ఈ దేశ ప్రజల్ని ఒక్కతాటిపైకి తేగలిగే శక్తి కూడా ఆమెకే ఉందట. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రయోజనాల కోసం అర్జెంటుగా ఆమెతో చర్చలు జరపాలట.

అసలు నరేంద్ర మోడీ కంటే సన్నీనే ఇండియాను ముందుకు తీసుకెళ్లగలదని.. అందుకే అమీర్ ఖాన్ లాంటి వాడు కూడా ఆమెకు మద్దతు పలికాడని.. అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్ తో కనెక్టయినట్లుగా మన ప్రజలు సన్నీ లియోన్ తో కనెక్టయిపోతారని ట్వీటాడు వర్మ. అంతటితో ఆగకుండా ఆసక్తికరమైన ప్రశ్నలత పోల్ కూడా నిర్వహించాడు. ‘‘కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యేలు నిజాయితీ పరులా.. లేక సన్నీ లియోనా’’... ‘‘మన దేశ ప్రజలకు ప్రభుత్వం ఎక్కువ సంతోషాన్నిచ్చిందా.. లేక సన్నీలియోనా’’.. ‘‘మీకు వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే సన్నీని ఎంచుకుంటారా.. లేక దీపికా పదుకొనేనా’’.. ‘‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ సన్నీతో చర్చలు జరపాలా వద్దా’’.. ఇవీ వర్మ పోల్ పెట్టిన ప్రశ్నలు. వర్మ కోరుకున్న తరహాలోనే జనాల రెస్పాన్స్ కూడా ఉందిలెండి. ఇంకా ఈ పోల్ ముగియడానికి టైం ఉంది. కావాలంటే మీరూ వెళ్లి మీ అభిప్రాయమేదో చెప్పేస్తూ ఓట్లేసేయండి.