Begin typing your search above and press return to search.
వర్మలో ఇంత ఎమోషన్ ఎప్పుడూ లేదట
By: Tupaki Desk | 5 Dec 2016 7:30 AM GMTరామ్ గోపాల్ వర్మ అంటే అస్సలు ఎమోషన్లు లేని వ్యక్తి లాగా కనిపిస్తాడు. వర్మే స్వయంగా తనకు ఎలాంటి ఎమోషన్లు లేవంటాడు. తాను చేసే సినిమాల విషయంలో కూడా వర్మ మాట ఇలాగే ఉంటుంది. ఐతే ‘వంగవీటి’ సినిమా మాత్రం ఇందుకు మినహాయింపు అన్నట్లు మాట్లాడుతున్నాడు వర్మ. ఇది నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అంటూ తనకు తాను కాంప్లిమెంట్ ఇచ్చుకోవడమే కాదు.. ఈ సినిమాతో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉందంటూ కొంచెం ఉద్వేగంగా మాట్లాడాడు వర్మ. ఈ సినిమా గురించి ఆయన ఇంకా ఏమన్నాడంటే..
‘‘నేను దర్శకుడిని కాకముందు నుంచి నాకు తెలిసిన కథ ‘వంగవీటి’. చదువుకునే రోజుల్లో నేను వంగవీటి మోహనరంగా ర్యాలీలో పాల్గొన్నాను. అప్పుడు విజయవాడలో నెలకొన్న పరిస్థితుల్ని స్టడీ చేసి ఆ అవగాహనతోనే నేను దర్శకుడిగా మారాను. ఈ సినిమాతో నాకున్న ఎమోషనల్ బాండింగ్ మరే సినిమాతోనూ లేదు. ఇది నా కలల సినిమా. నేను ఫ్యాక్షన్ సినిమాలు తీసి ఉండొచ్చు.. మాఫియా మీద లేదా హైదరాబాద్ గూండాయిజం మీద సినిమాలు తీసి ఉండొచ్చు. ఐతే నా 27 ఏళ్ల కెరీర్లో ‘వంగవీటి’ నా బెస్ట్ ఫిల్మ్. ఈ చిత్రానికి దర్శకుడిని నేను కాబట్టి ఈ మాట చెప్పడం సరి కాదేమో. అయినప్పటికీ చెబుతున్నా. వివాదాస్పద అంశాలతో నిజ జీవిత పాత్రల ఆధారంగా ఈ సినిమా తీయడం ఎంతోమందికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా ముందుకొచ్చిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు’’ అన్నాడు రామ్ గోపాల్ వర్మ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/