Begin typing your search above and press return to search.
మై గాడ్... ఇతనా వర్మ వీరప్పన్!
By: Tupaki Desk | 30 Dec 2015 1:30 PM GMTనిజ జీవిత సంఘటనలతోనూ, వ్యక్తులపైనా సినిమాలు తీయడంలో వర్మని మించినవాళ్లు లేరేమో. కరెంట్ ఎఫైర్స్ తో ఆయన తీసిన దాదాపు సినిమాలు హిట్టే. అదే విషయాన్ని అమితాబ్ లాంటి అగ్ర కథానాయకుడు కూడా చెబుతుంటారు. అయితే నిజ జీవిత సంఘటనలతో సినిమాలు తీసేటప్పుడు చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. అందరికీ తెలిసిన పాత్రలే తెరపై కనిపిస్తుంటాయి. ఆ పాత్రలకి తగ్గ నటుల్ని ఎంపిక చేసుకోవడం చాలా కష్టం.
ఇదివరకు పరిటాల రవి - మద్దెల చెర్వు సూరిల మధ్య నడిచిన ఫ్యాక్షనిజం నేపథ్యంలో రక్తచరిత్ర సీక్వెల్ సినిమాలు తీశాడు వర్మ. అయితే పరిటాల - సూరి పాత్రలకోసం ఎవర్ని ఎంపిక చేసుకొంటాడా అని జనాలు ఆసక్తికరంగా చూశారు. వివేక్ ఒబెరాయ్ - సూర్య లాంటి నటుల్ని ఎంపిక చేసుకొని వర్మ తన టేస్ట్ ఎలా ఉంటుందో మరోసారి చాటి చెప్పాడు. తాజాగా వీరప్పన్ పై తీసిన కిల్లింగ్ వీరప్పన్ సినిమా విషయంలోనూ అదే జరిగింది.
అచ్చం వీరప్పన్ ని పోలినట్టుగా ఇంతంత మీసాలు వేసుకొని, గన్ను చేతపట్టుకొని తెరపై కనిపిస్తుంటే `ఈ వర్మ ఎలా పట్టాడో కానీ... ఇతనెవరో వీరప్పన్ ని యాజిటీజ్ గా దించేశాడ్రా` అని మాట్లాడుకొంటున్నారు ప్రేక్షకులు. కానీ ఆ వీరప్పన్ పాత్రని పోషించిన అసలు వ్యక్తిని, అతని అసలు రూపాన్ని చూసినప్పట్నుంచి జనాలు వండర్ అవుతున్నారు. ఇతనా తెరపై కనిపించే వీరప్పన్ అని ముక్కున వేలేసుకొంటున్నారు. కానీ వర్మ మాత్రం ఈ నటుడు వీరప్పన్ పాత్రకి సరిపోతాడని సందీప్ భరద్వాజ్ ని చూసిన రెండు నిమిషాల్లోనే ఎంపిక చేసేశాడట. వర్మ సిక్స్త్ సెన్స్ అంతలా పనిచేస్తుంటుందని ఆయనతో పనిచేసిన టెక్నీషియన్లు చెబుతున్నారు.