Begin typing your search above and press return to search.

విశ్వనాథ్ కు ఫాల్కే?? కరణ్‌ జోహార్ ఇవ్వండి

By:  Tupaki Desk   |   25 April 2017 4:10 AM GMT
విశ్వనాథ్ కు ఫాల్కే?? కరణ్‌ జోహార్ ఇవ్వండి
X
అవతలికి ఎవడో మొండాడో.. తనకు తెలిసిందే రామాయణం.. అందులో అర్జునుడే హీరో అన్నాడట. ఇప్పుడు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. మనోడు ఏం మాట్లాడుతున్నాడో వింటే ఎవరైనా షాక్ తినేయకతప్పదు. కాకపోతే వర్మ చెప్పిన విషయాల్లో లాజిక్ కూడా ఉంది కాబట్టి.. ఒక ప్రక్కన మన బుర్ర వీటెక్కేయకా తప్పదు.

కళాతపస్వి విశ్వనాథ్‌ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించగానే.. రాములోని సెటైరిస్ట్ సంచేసుకుని బయలుదేరాడు. ''అసలు కె.విశ్వనాథ్ కంటే దాదాసాహెబ్ ఫాల్కే గొప్ప కాదు. ఫాల్కే అవార్డు విశ్వనాథ్ గారికి ఇవ్వడం ఏంటి? విశ్వనాథ్ అవార్డును ఫాల్కే కి ఇవ్వండి'' అంటూ బీభత్సాతి భీభత్సమైన పంచ్ తో తన జ్ఞానప్రదర్శన స్టార్ట్ చేశాడు వర్మ. ''నేను ఫాల్కే సినిమాలు చూశాను. విశ్వనాథ్ గారి సినిమాలూ చూశాను. విశ్వనాథ్ గారు తీసిన శంకరాభరణం చాలు.. ఆయన రేంజ్ చెప్పడానికి. అలాంటప్పుడు ఆయనకు ఫాల్కే అవార్డు ఇవ్వడమేంటి?'' అంటూ కంటిన్యూ చేశాడు.

''ఇంకా కావాలంటే రాజు హిరాణి అవార్డో.. కరణ్‌ జోహార్ అవార్డో ప్రకటించండి.. అంతేకాని ఫాల్కే అవార్డు ఏంటి? ఫాల్కే తీసిన 95 సినిమాల్లో ఒక్కటి కూడా కరణ్‌ జోహార్ సినిమాలకు సరితూగదు. కేవలం ఆయన పాత కాలంలో తీశాడంటే.. ఇక ఆయన గొప్పనేనా అర్ధం?'' అంటూ చెడగుడు ఆడుకున్నాడు వర్మ. ఓ యాంగిల్లో చూస్తే.. ఇవన్నీ కరక్టే అనిపించేలా ఉన్నాయి కదూ.

ఒకవేళ ఫాల్కే మన దేశంలో ''ఫాథర్ ఆఫ్‌ ఇండియన్ సినిమా'' అని కొలవబడతారు కదా.. ఆ సంగతి వర్మకు తెలియదంటారా? 1913లో రాజా హరిశ్చంద్రా అంటూ తొలి ఫీచర్ లెంగ్త్ ఇండియన్ సినిమా తీసి.. మన భారతదేశంలో సినిమా అనే ప్రక్రియ మొదలవ్వడానికి ఆయన ఆద్యం పోశారు. అయితే ఇదంతా వర్మకు కూడా తెలుసు. ఆయన దగ్గర ఒక క్లారిటీ ఉంది.

''లూయీస్ లూమియర్.. జార్జెస్ మెలియస్ వంటి దర్శకులు అందరూ కూడా.. సొంతంగా రకరాల కొత్త మెషినరీ కనిపెట్టి సినిమాలు తీశారు. ఫాల్కే కేవలం వ్యాపారం చేసుకోవడానికి సినిమాలు తీశాడు. అలాంటి ఫాథర్ ఆఫ్‌ సినిమా అని పిలిపించుకునే వారి సరసన ఫాల్కేను పెట్టి కన్ఫ్యూజ్ చేయకండి'' అంటూ చురక వేశాడులే. ఏదేమైనా కూడా వర్మ పంచ్ లు టూ మచ్ అబ్బా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/