Begin typing your search above and press return to search.

మహిళలకు హ్యాపీ విషెస్ చెప్పను

By:  Tupaki Desk   |   8 March 2016 9:09 AM GMT
మహిళలకు హ్యాపీ విషెస్ చెప్పను
X
మార్చ్ 8 మహిళా దినోత్సవం రోజున అందరూ మహిళలకు హ్యాపీ విమెన్స్ డే అని విషెస్ చెప్పేందుకు ఎవరూ అబ్జెక్షన్ చెప్పరు. కానీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను ఈ విషయంలోనూ విభిన్నం అంటున్నాడు. ఏ విషయాన్నైనా తనదైన ప్రత్యేక దృష్టితో చూసే వర్మ.. మహిళా దినోత్సవానికి కూడా అలాగే తన వెర్షన్ వివరించాడు.

హ్యాపీ ఉమెన్స్ డే అంటే.. ఆరోజు సంతోషంగా ఉండమని కోరుకోవడం. కానీ తాను మాత్రం స్త్రీలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానని.. అందుకే హ్యాపీ ఉమెన్స్ డే చెప్పనన్నది వర్మ వాదన. 'నేను మహిళలకు విష్ చేయను. మహిళలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటా. సంతోషం అంటే ఒక్క రోజుకే పరిమితం కావాలని అనుకోను' అని ట్వీట్ చేశాడు వర్మ.

'దేవుడి సృష్టిలో అత్యంత అద్భుతం మహిళలే. అందుకే టెర్రరిస్టులు - బొద్దింకల్లాంటి జీవాల నుంచి అసహ్యమైన జీవాలను సృష్టించినందుకు కూడా ఆ దేవుడిని క్షమించేస్తున్నా' అని రాసుకొచ్చాడు వర్మ. మొత్తానికి మహిళా దినోత్సవం రోజున కూడా తన స్టైల్ లో ట్వీట్లే కాకుండా, దేవుడిని కూడా లాక్కొచ్చేశాడు. కాకపోతే ఇక్కడ చెప్పుకునే పాజిటివ్ అంశం ఏంటంటే.. మహిళలను మాత్రం వర్మ తెగ పొగిడేయడం.