Begin typing your search above and press return to search.
ప్రభుత్వానికి క్షమాపణలా.. వర్మ ఆగ్రహం
By: Tupaki Desk | 7 Aug 2017 10:17 AM GMTరామ్ గోపాల్ వర్మకు మరోసారి కోపం వచ్చింది. టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విషయంలో ఆయన ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని.. మీడియాను విమర్శించారు. ఇప్పుడు ఆయన టార్గెట్ మారింది. ఈ కేసు విషయమై ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన ఫిలిం ఛాంబర్ కు ఘాటుగా బహిరంగ లేఖ రాశారు. సినీ పరిశ్రమ సిగ్గు పడాల్సిన విషయం డ్రగ్ స్కాండల్ కాదని.. ఈ వ్యవహారానికి సంబంధించి ఫిలిం చాంబర్ తెలుగు పరిశ్రమకు తలవంపులు తెచ్చేలా బహిరంగ లేఖ ద్వారా అవసరం లేని క్షమాపణ చెబుతూ ప్రాధేయ పడిన విధానమే సిగ్గు పడాల్సిన విషయమని వర్మ ఆ లేఖలో పేర్కొన్నాడు.
అధికారుల నుంచి నోటీసులు అందుకుని విచారణకు హాజరైన వారిలో ఎవరూ కూడా తాము తప్పు చేశామని బహిరంగంగా చెప్పలేదని.. అలాగే అధికారులు కూడా వాళ్లు తప్పు నిరూపించబడినట్లు చెప్పలేదని.. ఈ రెండూ జరగనపుడు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఎందుకు క్షమాపణ చెప్పారని వర్మ ప్రశ్నించాడు. కొంతమంది చేసిన ఈ పొరబాట్లకు పరిశ్రమ తలదించుకోవాల్సి రావడం బాధాకరం అంటూ అంటూ ఫిలిం ఛాంబర్ వ్యాఖ్యానించడం ఏంటని.. ఇక్కడ పొరబాట్లు చేసినట్లు మీకు ఎవరు చెప్పారని వర్మ ప్రశ్నించాడు. అసలు పరిశ్రమకు చెందిన వ్యక్తులు చేసిన నేరమేంటో.. దానికి ఆధారాలేంటో చూపించకుండా ఏదో మహానేరం చేసినట్లు కలరింగ్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి.. ఇప్పటికే నేరం రుజువైనట్లుగా క్షమాపణ లేఖ రాయడంలో అర్థమేంటని వర్మ ఆగ్రహించాడు. నోటీసులందుకుని విచారణకు హాజరైన వాళ్లందరూ తమ ఆవేదనను వెళ్లగక్కుతూ తన లాగే బహిరంగ లేఖలు రాయాలని వర్మ పిలుపునివ్వడం విశేషం. రేప్పొద్దున ఈ విచారణ ఎదుర్కొన్న వాళ్ల తప్పేమీ లేదని తేలితే.. ఫిలిం ఛాంబర్ వాళ్లకు కూడా క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖలు రాయాలని వర్మ డిమాండ్ చేశాడు.
రామ్ గోపాల్ వర్మ లేఖ చదవండి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి నా బహిరంగ లేఖ
- రామ్ గోపాల్ వర్మ
సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం డ్రగ్ స్కాండల్ కాదు..ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం
ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేసామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు?
అపాలజీ లెటర్ లో ఒక వాక్యం"అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో?
అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రడీ నేరం ఋజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి?
అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం -పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా,జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలి.
విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు చార్జెస్ కూడా ఫైల్ అవ్వని ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ వుంది.
ఒకవేళ అలా మాట్లాడడం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం".
అలాగే రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే ఆరోపణలు ఎదుర్కున్న వాళ్లందరికీ బహిరంగ లెఖ ద్వారా క్షమాపణ చెప్పాలి.
ఇలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలొ వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని... కాని ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేసారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది..ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను.
--RGV