Begin typing your search above and press return to search.
మళ్లీ మెగాస్టార్ ని పొగిడేసిన వర్మ
By: Tupaki Desk | 31 Aug 2016 4:37 AM GMTసంచలన దర్శకుడు అనిపించుకుని పిలిపించుకునే రామ్ గోపాల్ వర్మ.. సినిమాలతో పాటు ట్వీట్స్ తో కూడా తన బిరుదును సార్ధకం చేసుకుంటూ ఉంటాడు. సహజంగా ఈ డైరెక్టర్ నుంచి నెగిటివ్ కామెంట్స్ కానీ.. వెటకారం ట్వీట్స్ కానీ వస్తుంటాయ్. కానీ వర్మకు ఏమైందో తెలీదు కానీ.. ఓ వారం రోజులుగా పాజిటివ్ ఎసెన్స్ లో ట్వీట్స్ పెడుతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా పోస్టర్ లో ఇంటెన్సిటీ చూసి ఫిదా అయిపోయానని.. చిరు పుట్టిన రోజున ట్వీట్ చేసిన వర్మ.. నాగ్ బర్త్ డే రోజున విషెస్ చెప్పడం వింతగా అనిపించింది. ఇప్పడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్స్ పెట్టాడీ దర్శకుడు. ఎవరైనా యాక్టింగ్ ని ప్రేమిస్తారని.. కాని అమితాబ్ కు నటన అంటే మోహం అన్న వర్మ.. ప్రేమిస్తున్నట్లు ఛీట్ చేయచ్చు కానీ.. మోహిస్తున్నట్లు మోసం చేయడం కుదరదని చెప్పుకొచ్చాడు.
'ఔత్సాహిక డైరెక్టర్లందరూ పూనే.. విజ్లింగ్ వుడ్ ఇనిస్టిట్యూట్ లాంటి ఫిలిమ్ స్కూల్స్ కి వెళ్లే బదులు.. అమితాబ్ కెరీర్ గ్రాఫ్ ను స్టడీ చేస్తే చాలు. సుదీర్ఘ కెరీర్.. పెర్ఫామెన్స్ లో ఇంటెన్సిటీ చూపించడంలో ఆయన కష్టం.. ఇవే సీనియర్ బచ్చన్ ని ఈ స్థాయికి చేర్చాయి' అంటూ సడెన్ గా అమితాబ్ ని ఆకాశానికి ఎత్తేశాడు రామ్ గోపాల్ వర్మ. రీజన్ ఏంటో వర్మ చెప్పలేదు కాబట్టి మనక్కూడా తెలీదంతే.