Begin typing your search above and press return to search.
మణికర్ణికపై వర్మ సంచలన కామెంట్స్
By: Tupaki Desk | 26 Jan 2019 11:31 AM GMTతనకు నచ్చిన సినిమాలను ఆహా, ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేయడం వర్మకు అలవాటే. ప్రపంచంలోనే ఇంత గొప్ప సినిమా లేదని, ఇంతటి సినిమాను తానెప్పుడు చూడలేదంటూ గతంలో పలు సినిమాల సమయంలో చెప్పుకొచ్చాడు. తాజాగా మరో సారి 'మణికర్ణిక' పై అలాంటి కామెంట్స్ చేశాడు. మణికర్ణిక చిత్రంలోని కంగనా రనౌత్ నటనపై వర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏ యాక్షన్ హీరో కూడా కంగనా రనౌత్ నటనకు సరి తూగడన్నట్లుగా పేర్కొన్నాడు.
తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా మణికర్ణిక చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాన్సి లక్ష్మీ బాయి పాత్రలో కంగనా నటించిన తీరు, సినిమాలోని గ్రాఫిక్స్ బాగున్నాయంటూ టాక్ వచ్చింది. ఈ పాత్రను కంగనా తప్ప మరెవ్వరు ఇంతగా రక్తి కట్టించలేక పోయేవారని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక కంగనా రనౌత్ నటనపై వర్మ కాస్త ఘాటుగా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు.
వర్మ ట్విట్టర్ లో... వావ్, కంగనా రనౌత్ తన అద్బుతమైన నటనతో నన్ను కట్టి పడేసింది. ఎంటర్ ది డ్రాగెన్ చిత్రంలో బ్రూస్ లీ లా అద్బుతమైన నటనతో సినిమా స్థాయిని పెంచేసింది. ఈ చిత్రంలో కంగనా యాక్షన్ చూసిన తర్వాత అందరు యాక్షన్ హీరోలు కూడా నాకు హీరోయిన్స్ మాదిరిగానే కనిపిస్తున్నారంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. వర్మ ఏ సినిమా గురించైనా కాస్త అతిగానే కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇలా కామెంట్ చేసినంత మాత్రాన సినిమా గొప్పగా ఉందని చెప్పలేం, సినిమా ఫలితం ఏంటో రెండు మూడు రోజులైతే కాని తెలియదు.