Begin typing your search above and press return to search.

బాహుబ‌లితో ఎంత‌మంది సూసైడ్ చేసుకుంటారో?

By:  Tupaki Desk   |   17 March 2017 7:31 AM GMT
బాహుబ‌లితో ఎంత‌మంది సూసైడ్ చేసుకుంటారో?
X
వివాదాస్ప‌ద ట్వీట్ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో ఉండే వ్య‌క్తి రామ్ గోపాల్ వ‌ర్మ‌. ట్రెండింగ్ విష‌యాల మీద అత‌ను స్పందించినంత విల‌క్ష‌ణంగా మ‌రెవ‌రూ స్పందించ‌లేరు. పొడ‌గ‌టంలో అయినా.. తెగడ‌టంలో అయినా త‌న‌కు తానే సాటి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ‌.. తాజాగా బాహుబ‌లి 2 ట్రైల‌ర్ మీద ప‌డిపోయారు. ట్రైల‌ర్ రిలీజ్ అయిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 5 కోట్ల వ్యూస్ (50 మిలియ‌న్స్‌) సాధించిన మొట్ట‌మొద‌టి భార‌తీయ చిత్రంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రికార్డుమీద త‌న‌దైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు వ‌ర్మ‌.

ఈ ఫిగ‌ర్ ను చూసి ఎంత‌మంది ఆత్మ‌హ‌త్య చేసుకుంటారో భ‌యంగా ఉందంటూ ట్వీట్ చేసిన వ‌ర్మ‌.. ప్ర‌భాస్ తో సినిమాలు చేయ‌టానికి ఐదు అతి పెద్ద కంపెనీలు దెబ్బ‌లాడుకుంటున్నాయ‌న్న మాట‌ను చెప్పుకొచ్చారు. బాహుబ‌లి2 త‌ర్వాత ప‌వ‌ర్ ఫులెస్ట్‌.. మెగా సూప‌ర్ స్టార్ అంద‌రికి ప్ర‌భాస్ కాలి గోటిని అందుకోవ‌టానికి రెండున్న‌ర జ‌న్మ‌లు ప‌డుతుందంటూ వ్యాఖ్యానించారు. టాలీవుడ్ ప‌వ‌ర్ ఫుల్ స్టార్లంద‌రూ నేష‌న‌ల్ గా ట్రై చేసి.. రీజ‌న‌ల్ గా ఉండిపోయార‌ని.. కానీ ప్ర‌భాస్ మాత్రం రెండు సినిమాల దెబ్బ‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ అయిపోయినట్లుగా ట్వీట్ చేసి.. ఆకాశానికి ఎత్తేశాడు.

బాహుబ‌లి2 ట్రైల‌ర్ లో ప‌దివేల మంది అమ్మాయిల కంటే ప్ర‌భాస్ అందంగా క‌నిపించాడ‌న్న వ‌ర్మ‌.. ఈ ట్రైల‌ర్‌ ని ప్ర‌పంచ‌మంతా జై కొడుతున్నా.. టాలీవుడ్ మాత్రం సూప‌ర్ సైలెంట్ గా ఉండిపోవ‌టానికి కార‌ణం.. కుళ్లు స‌ముద్రంలో మునిగిపోవ‌టం వ‌ల్ల‌నేన‌ని తేల్చేశాడు. ఇలా త‌న‌దైన శైలిలో త‌న భావాల్ని ట్వీట్ల‌తో పంచేస్తూ.. అంద‌రి దృష్టి త‌న మీద ప‌డేలా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/