Begin typing your search above and press return to search.
పోకిరి ప్లాప్ అన్న వర్మ..లవ్ యూ సర్ అన్న పూరీ
By: Tupaki Desk | 22 Jan 2018 5:23 AM GMTతన పోస్టులతో నిత్యం వార్తలుగా మారటం వర్మకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. తన మనసుకు తోచినట్లుగా వ్యాఖ్యలు చేసే వర్మ ఉన్నట్లుండి మహేశ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మూవీ ప్లాప్ గా అభివర్ణించారు. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన పోకిరిని ప్లాప్ మూవీగా వర్మ ఎందుకు వ్యాఖ్యానించాడు.. అందులో లాజిక్ ఏమిటన్నది చూస్తే.. అసలు విషయం వేరని చెప్పక తప్పదు.
ఒకరిని పొగడాలంటే మరొకరిని కచ్చితంగా చిన్నబుచ్చటం వర్మకున్న అలవాటు. దాన్ని ఫాలో అయిన వర్మ పోకిరి ఎందుకు ప్లాప్ మూవీనో చెప్పేశారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా మెహబూబా అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాలో కొన్ని సీన్లు చూసిన వర్మ.. తన శిష్యుడైన పూరీపై ప్రశంసల జల్లు కురిపించారు.
ఈ సినిమాలోని కొన్ని సీన్లను చూసిన వర్మ ఫిదా కావటమే కాదు.. పూరీ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పోకిరితో పోల్చారు. మెహబూబాతో పోలిస్తే పోకిరి ప్లాప్ చిత్రంగా అభివర్ణించారు. తన కొడుకు మీద ఉన్న ప్రేమతో మెహబూబాను అత్యంత అద్భుతంగా మలిచారని.. ఓ అందమైన కావ్యంగా తయారు చేశారని ట్వీటారు.
వర్మ ట్వీట్ కు ఆయన శిష్యుడు పూరీ స్పందించారు. ఇన్నాళ్లకు తనను తన గురువు ఒక ఫిలిం మేకర్ గా గుర్తించినందుకు పొంగిపోయారు. తన జీవితంలో ఇదో పెద్ద కాంప్లిమెంట్ గా పేర్కొనటంతోపాటు.. లవ్ యూ సర్ అంటూ రిప్లై ట్వీట్ చేశారు.
1971 భారత్.. పాక్ ల మధ్య జరిగే యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న మెహబూబా మూవీలో ఆకాష్ పూరీ సరసన నేహా శెట్టి హీరోయిన్. పోకిరి కంటే బాగుంటుందన్న విషయాన్ని అదే రీతిలో చెబితే మీడియాలో పెద్దగా ఎక్కదన్న సంగతి వర్మకు తెలియంది కాదు. అందుకేనేమో.. తన శిష్యుడి అప్ కమింగ్ మూవీని నేరుగా పొగడకుండా పోకిరిని చిన్నబుచ్చేలా మాట్లాడి.. మొహబూబాను మాట్లాడుకునేలా చేశారని చెప్పాలి. ఏమైనా.. కనిపించడు కానీ వర్మ ట్వీట్లలో లెక్కలు చాలానే ఉంటాయండి బాబు.