Begin typing your search above and press return to search.
వర్మ ప్రశంసించాడా.. ఫిటింగ్ పెట్టాడా?
By: Tupaki Desk | 21 Nov 2015 11:30 AM GMTసంచలన సినిమాలకు చిరునామా అయిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు తీయడం లేదు కానీ తన వ్యాఖ్యలతో నిత్యం సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ట్విట్టర్ లో ఏదో ఒక చర్చకు తెరతీస్తున్నారు. తాజాగా ఆయన తెలుగు యువ కథానాయకులకు చురకలేశారు. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన 'కుమారి 21 ఎఫ్' సినిమా రిలీజ్ సందర్భంగా టాలీవుడ్ స్టార్ వారసులను టార్గెట్ చేస్తూ తన మార్క్ ట్వీట్ లతో చెలరేగిపోయాడు. ఈ సినిమా హీరో రాజ్ తరుణ్ ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవల్సింది చాలా ఉందంటూ ట్వీట్ చేశాడు. అయితే... ఇది రాజ్ తరుణ్ ను మెచ్చుకోవడం కాదని, ఆయన్ను ఇబ్బంది పెట్టడమేనన్న వాదన వినిపిస్తోంది. వర్మ పోలికల వల్ల మిగతా హీరోలంతా రాజ్ తరుణ్ ను టార్గెట్ చేసి ఒంటరిని చేసే ప్రమాదముందంటున్నారు.
తాజా ట్వీట్ లలో వర్మ.... 'తెలుగు సినిమా హద్దులు చెరిపేస్తున్న రాజ్ తరుణ్ ను చూస్తే గర్వంగా ఉంది. ఇప్పటికీ పాత తరహా సినిమాలకే పరిమితమైన కుర్ర హీరోలు రాజ్ తరుణ్ ను చూసి నేర్చుకోవాలి. ప్రేక్షకులను ఇడియట్స్ గా భావించి సినిమాలు చేసే స్టార్ వారసులు రాజ్ తరుణ్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వెండితెర మీద బాహుబలి లాంటి భారీ చిత్రాలు లేదా కథాబలం ఉన్న భలే భలే మొగాడివోయ్ - కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి' అని ఆయన ట్వీట్ చేశారు. కుమారి సినిమాను ప్రశంసిస్తూనే సినీకుటుంబాల కుర్రహీరోలను వర్మ విమర్శించాడు. అయితే.. రాజ్ తరుణ్ గతంలో వర్మను కామెంట్ చేసినట్లుగా ప్రచారం జరిగింది.. ఆ కసితోనే వర్మ ఆయన్ను తెలివిగా ఇరికించారని అంటున్నారు.