Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డికి సెల్యూట్ అనేసిన వర్మ
By: Tupaki Desk | 13 April 2018 4:41 AM GMTశ్రీరెడ్డి విషయంలో ఇండస్ట్రీ జనాల అంచనాలు తప్పయ్యాయనే మాట ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రమే కాదు.. ఈమె గురించి నేషనల్ మీడియా గురించి కూడా మాట్లాడుకుంటోంది. తను బైటకు వచ్చి ఓ వివాదం గురించి మాట్లాడడం.. దాని గురించి అందరూ మాట్లాడుకునేలా చేయడానికి ఎవరూ చేయని ధైర్యం చేయడం.. అదే మాట మీద నిలబడి ఉండడం.. ఎలాంటి బెదిరింపులకు లొంగకపోవడం.. మీడియా నుంచి వచ్చిన మద్దతు.. ఇఫ్పుడు ఈ తరహా వేధింపులకు గురి అయిన ఇతరులను కూడా కదులుస్తున్నాయి.
ఈ ఎపిసోడ్ ను ముందు నుంచి నిశితంగా పరిశీలిస్తున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. శ్రీరెడ్డికి సెల్యూట్ అనేస్తున్నాడు. 'సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే సంస్కృతి 100 ఏళ్ల వెనుక నుంచి ఉంది. కానీ ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా.. ఈ అంశాన్ని ఇంత పెద్ద స్థాయికి తీసుకువచ్చిన శ్రీరెడ్డికి సెల్యూట్ చెబుతున్నారు. ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ లో భాగం అయి వారికి భయాలు కలుగుతున్నాయంటే అందుకు కారణం శ్రీరెడ్డి' అన్నాడు వర్మ.
'తన బట్టలు ఊడదీసుకుని శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేసినపుడు తప్పు పట్టిన వాళ్లు అందరికీ నెమ్మదిగా విషయం బోధపడుతోంది. ఇప్పుడు నేషనల్ మీడియానే కాదు.. ఇంటర్నేషనల్ సమాజం కూడా మేల్కొంటోంది. ఓ నటిగా తన లక్ష్యాన్ని అందుకోవడంలో ఎదురైన ఇబ్బందులను అందరికీ చెప్పడంతో పాటు.. ఔత్సాహిక నటీమణుల ఇబ్బందుల విషయంలో శ్రీ రెడ్డి అఛీవ్ చేసిన విషయంపై.. ఆమె తల్లి కచ్చితంగా గర్వపడతారు' అంటూ ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ.