Begin typing your search above and press return to search.
పంతకం నెగ్గించుకోనున్న వర్మ!
By: Tupaki Desk | 28 May 2019 5:13 AM GMTకొన్ని విషయాల మీద ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చాలా పట్టుదలగా ఉంటాడు. తాను టేకప్ చేసిన విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే అలవాటు లేని వర్మ.. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి విజయవాడ పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెట్టాలనుకోవటం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ.. అలా చేయటం కుదరదని.. ప్రెస్ మీట్ పెట్టకుండా ఎన్నికల వేళలో విజయవాడ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వర్మ సీరియస్ కావటమే కాదు.. ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.
ఎన్నికల్లో జగన్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత.. తాను పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడతానని.. దమ్ముంటే అడ్డుకోవాలంటూ సవాల్ విసిరిన ఆయన.. ఆ తర్వాత పోలీసుల వినతితో వెనక్కి తగ్గి వేరేచోట ప్రెస్ మీట్ పెట్టటం తెలిసిందే.
పోలీసుల సూచన మేరకు తాను ప్రెస్ మీట్ వెన్యూ మార్చుకున్నట్లు చెప్పిన వర్మ.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తానని చెప్పారు. అనంతరం అక్కడే ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా పేర్కొన్నారు. వర్మతో పాటు..రాకేష్ రెడ్డి కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెట్టాలన్న పంతాన్ని వర్మ తీర్చుకోకుండా ఉండలేకపోతున్నట్లుగా లేదూ? మరీసారి ఆయన ప్రయత్నం ఫలిస్తుందా?