Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ని వదిలిపెట్టని వర్మ

By:  Tupaki Desk   |   22 Dec 2018 7:38 AM GMT
ఎన్టీఆర్ ని వదిలిపెట్టని వర్మ
X
ఎన్ని చెత్త సినిమాలు తీసినా పబ్లిసిటీకి లోటు లేకుండా చూసుకోవడంలో వర్మను మించిన వాళ్ళు ఇండియాలోనే లేరన్న మాటలో అతిశయోక్తి లేదు. తన మీద క్రెడిబులిటీ ఏనాడో పోగొట్టుకున్నా ఎప్పటికప్పుడు ఏదో ఒక జిమ్ముక్కుతో వార్తల్లో నిలుస్తూ హైప్ లేని మూవీస్ కి ఏదోలా ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో ఇప్పటికీ తన చాకచక్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఒక పక్క నందమూరి అభిమానులు ఎన్టీఆర్ తాలూకు ట్రైలర్ ని ఆస్వాదిస్తూ ఉండగా అదే రోజు దాని కంటే మూడు గంటలు ముందుగా తన లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వెన్నుపోటు పాటను విడుదల చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే.

24 గంటలు దాటకుండానే ఈ పాట మిలియన్ వ్యూస్ కి దగ్గరలో ఉండటం దీని మీద జనంలో ఉన్న ఆసక్తిని చెప్పకనే చెబుతోంది. ఎవరెన్ని ఆడిపోసుకున్నా తన మానాన తన సినిమాల ప్రచారంలో చేసుకునే వర్మ ఇప్పుడో కొత్త ఎత్తుగడకు తెరతీశాడు. ఎన్నికల సమయంలో ముందస్తుగా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ తరహాలో ఏ ఎన్టీఆర్ సినిమాకు పబ్లిక్ ఆసక్తిగా ఉన్నారు అనే దాని మీద వోటింగ్స్ పెట్టాడు. అందులో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఏకంగా 70 శాతం పైగా మద్దతు లభించడం చూసి దాన్ని ట్విట్టర్ లో గర్వంగా చాటింపు వేసుకుంటున్నాడు వర్మ.

కథానాయకుడు మహానాయకుడులకు సింగల్ డిజిట్ పర్సెంటేజ్ లభించడం అసలు ట్విస్ట్. మరో పోల్ లో ఏ ఎన్టీఆర్ సబ్జెక్టు మీద ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు అనే ప్రశ్నకు లక్ష్మీస్ ఎన్టీఆర్ కు 62 శాతం రాగా మిగిలిన 38 శాతంతో బాలకృష్ణ ఎన్టీఆర్ సర్దుకుంది. ఏదైతేనేం తన లక్మిస్ ఎన్టీఆర్ దే పై చేయి అని చెప్పడానికి వర్మ పడుతున్న పాట్లు మాములుగా లేవు.