Begin typing your search above and press return to search.
దేవుడా..శ్రీదేవి గురించి ఇన్ని రకాలుగా వినాల్సి రావటమా
By: Tupaki Desk | 27 Feb 2018 4:25 AM GMTఒక ప్రముఖ సెలబ్రిటీని మరో ప్రముఖ సెలబ్రిటీని అమితంగా ఆరాధించటం మామూలేమో కానీ.. అతిలోక సుందరి శ్రీదేవిని ఆరాధనాభావానికి మించిందేదో అన్నట్లుగా ఆరాధనను వ్యక్తం చేయటం వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకే చెల్లుతుంది. తన జీవితంలో ఎవరి మీదనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారేమో కానీ శ్రీదేవి గురించి మాత్రం పల్లెత్తు మాట అనకపోవటం కనిపిస్తుంది.
టైమ్లీగా తన అభిప్రాయాల్ని మార్చుకోవటం.. కాలంతో పాటు సాగే మార్పులకు తగ్గట్లే మార్పులు సహజమని వాదించే వర్మ.. శ్రీదేవి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తారు. తాను కాలేజీ చదివే వేళలో.. శ్రీదేవిని చూసినప్పుడు ఎంతలా అభిమానించారో.. ఈ రోజున కూడా అంతే ఆరాధనను ఆర్జీవీ వ్యక్తం చేస్తుంటారు.
శ్రీదేవి మరణ వార్త మీడియాలో తెల్లవారుజాము ప్రాంతంలో వస్తే.. ఇంచుమించే అదే సమయంలో ఆమె మరణానికి సంబంధించిన ట్వీట్లు పెట్టటమే కాదు.. ఆ రాత్రంతా ఆయన నిద్రపోలేదన్న విషయం ఆయన వరుసగా పెట్టిన ట్వీట్లు చూస్తే తెలుస్తుంది.
శ్రీదేవి మీద మళ్లీ ట్వీట్ పెట్టనంటే పెట్టనంటూ ఆవేదనతో తనది ఇదే చివరి ట్వీట్ అంటూ చెప్పిన వర్మ మాట మీద ఉండలేని పరిస్థితి. శ్రీదేవి మృతిపై సరికొత్త సందేహాలు తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ఆయన రియాక్ట్ అయ్యారు. తాను శ్రీదేవిని ద్వేషిస్తున్నానని.. ఆమెను చంపినందుకు దేవుడ్ని కూడా ద్వేషిస్తున్నానని చెబుతూనే.. శ్రీదేవిని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పిన వర్మ.. తాజాగా వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. జనాలెప్పుడూ శ్రీదేవి అందం.. ఆమె శరీరం.. హావభావాలు.. పెదాలు.. నడుము గురించి మాత్రమే మాట్లాడుకునే వారన్నారు.
కానీ.. ఆమె రక్తంలో మద్యం ఉందని.. ఊపిరితిత్తుల్లో నీళ్లు అన్నాయని.. పొట్టలో ఏవేవో ఉన్నట్లుగా ఏవేవో చెబుతున్నారని.. ఓ దేవుడా.. ఎవరి జీవితమన్నా.. ఘోర విషాదంగా.. అతి భయంకరంగా ముగుస్తుందా? అంటూ ప్రశ్నించారు.
"శ్రీదేవి మరణవార్తను రకరకాలుగా వినాల్సి రావటం అత్యంత బాధాకరంగా అభివర్ణించిన వర్మ.. నన్ను నేను చంపుకోవాలన్నంత కోపం వస్తోంది" అంటూ ట్వీట్ చేశారు.