Begin typing your search above and press return to search.
వర్మ 50 కోట్లు వద్దనేశాడా?
By: Tupaki Desk | 16 March 2019 7:14 AM GMTలక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు వారం కంటే తక్కువ వ్యవధి ఉంది. సెన్సార్ అప్ డేట్ ఇప్పటిదాకా రాలేదు. ఒకపక్క టిడిపి రిలీజ్ ను అడ్డుకునేందుకు ఎన్నికల కమీషన్ ను సంప్రదించినా లాభం లేకపోయింది. సినిమాల విడుదల తమ పరిధిలోని అంశం కాదని సున్నితంగా తిరస్కరించడంతో కోర్ట్ ఒక్కటే మార్గంగా నిలిచింది. ఈ సస్పెన్స్ ఇంకో రెండు మూడు రోజులు కొనసాగేలా ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవలే ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత రాకేష్ చెప్పిన విషయాలు సంచలనాత్మకంగా మారాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ కనక ఆపేస్తే 50 కోట్లు ఇస్తామనే ఆఫర్ వర్మకు వచ్చిందని అయితే ఆయన అలా డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి కాదని తనకు తెలుసనీ రాకేష్ చెప్పడం విశేషం. వర్మ అప్పుల్లో ఉన్నాడని అందుకే తీసుకునే ఛాన్స్ ఉందనే వార్తల గురించి ప్రస్తావిస్తూ అంత ఖర్మ వర్మకు పట్టలేదని క్లారిటీ ఇచ్చేశాడు. డబ్బు కోసం ఆత్మ గౌరవాన్ని అమ్ముకునే వ్యక్తి వర్మ కాదని మరో సర్టిఫికెట్ ఇచ్చేశారు.
సరే తన నిర్మాణంలో వస్తున్న సినిమాకు దర్శకుడు కాబట్టి ఇవన్ని చెప్పడం మామూలే అనుకుందాం కానీ అసలు లక్ష్మిస్ ఎన్టీఆర్ 22కి వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ ఫాన్స్ ని వీడటం లేదు. వారం ముందుగానే ఆన్ లైన్ లో పెట్టాల్సిన అడ్వాన్స్ బుకింగ్ జాడ లేదు. అసలు థియేటర్లు ఓకే చేసుకున్నారా లేదా అనే సమాచారం సైతం లేదు. స్క్రీన్ల కు కొదవ లేదు. బాక్స్ ఆఫీస్ డల్ గా ఉన్న నేపధ్యంలో ఒకటికి రెండు ఈజీగా దొరుకుతాయి. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ వస్తుందా అనేదే ప్రస్తుతానికి భేతాళ ప్రశ్న