Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు వర్మ దీటైన జవాబు!
By: Tupaki Desk | 18 Oct 2017 10:42 AM GMT‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తెరకెక్కించబోతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై టీడీపీ మాటల యుద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ నాయకులు - నేతలు - మంత్రులు - ఎమ్మెల్యేలు....వర్మపై విమర్శలు గుప్పించడం, వారందరికీ వర్మ రిటార్ట్ ఇవ్వడం తెలిసిందే. వర్మ సినిమా సినిమా చూడకుండానే టీడీపీ నేతలు కామెంట్లు చేయడంపై విమర్శలు రావడంతో ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. తమకు తామే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నామని గ్రహించిన చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు కీలకమైన సూచనలకు చేశారు. టీడీపీ నేతలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై విమర్శలు చేయవద్దని చంద్రబాబు చెప్పారు. వాస్తవ ఘటనలకు విరుద్ధంగా చరిత్రను వక్రీకరించి తీసే సినిమాలకు ప్రజాదరణ ఉండదన్నారు. ప్రజామోదం లేని సినిమాల పట్ల అంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై వర్మ తనదైన శైలిలో బదులిచ్చారు. గతంలో టీడీపీ మంత్రులు - ఎమ్మెల్యేలకు రిటార్ట్ ఇచ్చిన విధంగానే చంద్రబాబుకు కూడా ఫేస్ బుక్ లో ఘాటుగా జవాబిచ్చారు. తాను కూడా ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజాలను మాత్రమే సినిమాలో చూపించబోతున్నానని, వాస్తవాలను వక్రీకరించే ఉద్దేశం తనకు లేదని వర్మ అన్నారు. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం వంటిదని - ఆ పుస్తకంలో నుంచి చింపి వేసిన పేజీలను తాను తిరిగి అతికించబోతున్నానని వర్మ చెప్పారు.
లక్ష్మి’స్ ఎన్టీఆర్, పై సీఎం చంద్రబాబు నాయుడు గారి కామెంట్ల పై నా కామెంట్లు :
లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ముమ్మాటికీ నిజం ..అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం వక్రీకరించకుండా తియ్యబోతున్నాను.
CBN గారన్నట్టు NTR జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి’స్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను.
చంద్రబాబుపై వర్మ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్మను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నామని కొందరు కామెంట్లు చేశారు. చంద్రబాబుకు వర్మ రిప్లై అదిరిపోయిందని కొందరు అంటున్నారు. వర్మపై కామెంట్లు చేసిన టీడీపీ నేతలకు ఆయన ఘాటుగా రిటార్ట్ ఇస్తూనే వచ్చారు. ఇప్పటివరకు ఒక్కరు కూడా వర్మ కామెంట్లకు కౌంటర్ ఇవ్వలేదు. అయితే, ఏపీ సీఎం చంద్రబాబు ...వర్మ కామెంట్లకు రిటార్ట్ ఇస్తారా? లేదా అందరిలాగే సైలెంట్ అయిపోతారా అన్న చర్చలు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నాయి.