Begin typing your search above and press return to search.

వర్మ - కీరవాణి పిచ్చి ట్వీట్లు

By:  Tupaki Desk   |   30 Jan 2018 5:52 AM GMT
వర్మ - కీరవాణి పిచ్చి ట్వీట్లు
X
హెడ్డింగ్ చూసి అది వాళ్ళు చేసుకున్న కామెంట్స్ గురించి అనుకునేరు సుమా. కాదండి. ఒకరి మీద ఒకరు అభిమానంతో పెట్టుకున్న మెసేజుల్లో ప్రధానంగా కనిపించిన పదాన్నే ఇక్కడ హై లైట్ చేసాం. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ద్వారా పెను సంచలనమే రేపిన రామ్ గోపాల్ వర్మ దానికి కీరవాణితో మ్యూజిక్ చేయించడం బాగా ప్లస్ అయ్యింది. మియా మల్కొవా అందాలు, మాటలు, వర్మ చెప్పిన సిద్ధాంతాలు వీటి కన్నా క్రీమ్ పేరుతో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వీడియోలో మంచి ఫీల్ కలిగేలా చేసింది. అందుకు థాంక్స్ చెబుతూ కీరవాణి ట్వీట్ చేసారు. విభిన్నం అనిపించే ఎమోషన్స్ ను తెరపై చూపించే వర్మతో గతంలో రొమాన్స్, కామెడీ సినిమాల కోసం పనిచేసానని, ఇప్పుడు సెక్స్ కు ఇచ్చానని, త్వరలో హారర్, వయోలెంట్ చిత్రాలకు కూడా అవకాశం ఇస్తున్న పిచ్చి దర్షకుడు వర్మకు థాంక్స్ అంటూ ప్రత్యేకంగా అభినందించాడు కీరవాణి.

కీరవాణి నిజానికి వర్మ సినిమాలకు ఎక్కువ పని చేయలేదు. వెంకటేష్ తో వర్మ తీసిన క్షణ క్షణంకు మాత్రమే కీరవాణి పూర్తి సంగీత దర్శకుడు. ఆ తర్వాత చేసిన నాగ్ 'అంతం' కోసం బర్మన్ తో కలిసి ట్యూన్స్ షేర్ చేసుకున్నాడు కాని దానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది మణిశర్మ. ఆ తర్వాత ఇక ఏ సినిమాకు ఈ కాంబో కుదరలేదు. ఇన్నాళ్ళ తర్వాత ఈ ఇద్దరు కలిసి సినిమాలకు కలిసి పని చేయబోతున్నారు. ఆ సంతోషాన్నే కీరవాణి ఇలా పంచుకున్నాడు. ఊరికే ఉంటే వర్మ ఎందుకు అవుతాడు. తను కూడా ధీటుగా ఇచ్చేసాడు.

తన కంటే కీరవాణి పెద్ద పిచ్చాడు అన్న వర్మ క్షణ క్షణం-అన్నమయ్య-బాహుబలి-గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ లాంటి డిఫరెంట్ జానర్ ఉన్న సినిమాలకు తెలివైన పిచ్చోడు మాత్రమే జంప్ కాగలడని, అందుకే తాను క్రీమ్ ను నమ్మానని చెప్పాడు వర్మ. అంతా బాగానే ఉంది కాని ఒకరిమీద ఒకరు ఇంత పిచ్చి ప్రేమ ఉన్న స్నేహితులు ఇప్పటి దాకా పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా ఒక సినిమాకు మాత్రమే పని చేయటం ఏమిటో.