Begin typing your search above and press return to search.
బాహుబలి2 పై ఇవేం కామెంట్స్??
By: Tupaki Desk | 30 April 2017 4:43 AM GMTరాంగోపాల్ వర్మకు బాహుబలి2 మూవీ చూశాక దాదాపు పూనకం వచ్చేసిందేమో అనిపిస్తోంది. సహజంగా పూనకాలు కాసేపటికి తగ్గుతాయ్ కానీ.. వర్మకు మాత్రం రెండు రోజులు గడిచిపోయినా తగ్గలేదనుకుంట. ఇంకా బాహుబలిని ఎన్ని రకాలుగా పొగడాలా అన్న విషయంపైనే తన ఇంటెలిజెన్స్ అంతా చూపిస్తున్నాడు. తన సినిమాల్లో చూపించలేకపోతున్న తెలివితేటలన్నీ పక్కనోళ్ల మూవీపై చూపిస్తున్నాడు.
తాజాగా బాహుబలి2 నిర్మాత శోభు యార్లగడ్డ 'యూఎస్ ఏలో బాహుబలి వరద' అని ట్వీట్ పెట్టాడు. దీనికి రిప్లై ఇచ్చిన రాంగోపాల్ వర్మ.. 'సార్ బాహుబలి2 ను వరద అనడం చాలా చిన్న మాట. ఇది తుఫానుతో వోల్కనో ఇంటర్ కోర్స్ జరిపితే.. వచ్చిన అనేక భూకంపాల ప్రభావం' అంటూ ట్వీట్ పెట్టాడు. బాహుబలి2 కు వస్తున్న కలెక్షన్స్ స్థాయిని ఇంత క్రియేటివ్ గా వివరించాడన్న మాట. బాహుబలిని పొగడాలన్న రాంగోపాల్ వర్మ ఆలోచనలో తప్పేమీ లేదు కానీ.. ఒకళ్లను వర్మ పొగడ్డం అంటే.. మరొకరిని తక్కువ చేయడం తప్ప మరేమీ ఉండదు.
ఇలాంటి క్రియేటివిటీలో పదో వంతు లేటెస్ట్ సినిమాలపై చూపిస్తే.. వర్మ మీద జనాలు పెట్టుకున్న ఆశల్లో కొన్నైనా తీరతాయోమో. బాగున్న సినిమాని ఎంత బాగున్నా ఒకట్రెండు సార్లు పొగిడితే.. మనసారా ప్రశంసించినట్లుగా ఉంటుంది. అదే పనిగా చేస్తే.. డోలు సన్నాయి పట్టుకుని భజన వాయించినట్లే అనుకుంటారు జనాలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/