Begin typing your search above and press return to search.
వర్మ ఆగట్లేదండోయ్..!
By: Tupaki Desk | 2 Dec 2015 5:16 AM GMTతనపైన తన భార్యపైన రకరకాలుగా కామెంట్లు చేస్తున్న రామ్ గోపాల్ వర్మపై శ్రీదేవి భర్త బోనీకపూర్ మండిపడిన విషయం తెలిసిందే. వర్మ గౌరవ మర్యాదలు లేకుండా వ్యవహరిస్తున్నాడని, అతనో వెర్రి మనిషి అని ఆరోపించారు. అయినా సరే... వర్మ మాత్రం ఆగట్లేదు. తన ఆరాధ్య కథానాయిక అయిన శ్రీదేవిని ఆమె భర్త బోనీకపూర్ కంటే ఎక్కువగా గౌరవిస్తున్నానని రిప్లై ఇచ్చాడు వర్మ. ఆ విషయం శ్రీదేవి మనసుకు బాగా తెలుసని కూడా కామెంట్ చేశాడు.
వర్మ `గన్స్ అండ్ థైస్` పేరుతో తన జీవిత చరిత్రను రాసిన విషయం తెలిసిందే. అందులో శ్రీదేవి గురించి ఓ అధ్యాయం రాశాడు. తాను శ్రీదేవిని ఎంతగా ప్రేమిస్తున్నదీ, ఆమెని వంటింటికి పంపిన భర్త బోనీకపూర్ ని ఎంతగా ద్వేషిస్తున్నదీ ఆ పుస్తకంలో రాసుకొచ్చాడు వర్మ. ఆ విషయం గురించి ఇటీవల పలు వేదికలపై కూడా మాట్లాడాడు. అయితే వర్మ శ్రీదేవి గురించి మాట్లాడటం ఇది కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా చాలాసార్లు శ్రీదేవిపై తనకున్న ప్రేమని బయటపెట్టాడు.
అయితే వర్మ ఏం మాట్లాడినా సరే.. శ్రీదేవి నుంచిగానీ, ఆమె భర్త బోనీ కపూర్ నుంచి కానీ స్పందన వచ్చేది కాదు. కానీ ఈసారి మాత్రం బోనీ తీవ్రంగా స్పందించాడు. ప్రచారం కోసమే వర్మ ఇలా పర్వెర్టెడ్ మైండ్ తో వ్యాఖ్యలు చేస్తుంటాడని ఆరోపించారు. ఆ మాటలు వర్మ చెవిన కూడా పడ్డాయి. అందుకే ట్విట్టర్ ద్వారా వర్మ మరోసారి స్పందించాడు. బోనీకపూర్ నాపైన విషం కక్కే ముందు పుస్తకంలో శ్రీదేవిగారి గురించి ఏం రాశానో చదవాలని ట్వీట్ చేశాడు. శ్రీదేవిగారినీ - ఆమె తొడలనీ - నటననీ - నవ్వునీ - ఆమె వ్యక్తిత్వాన్నీ - ఆమె ప్రేమించిన బోనీకపూర్ నీ ఎప్పటికీ నేను గౌరవిస్తుంటానని తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.