Begin typing your search above and press return to search.
పెళ్లాం, గాళ్ ఫ్రెండ్ పాతవేగా
By: Tupaki Desk | 1 Jan 2016 9:18 AM GMTవర్మ ఏం టచ్ చేసినా అందులో అంతర్లీనంగా సెటైర్ ఉంటుంది. పంచ్ ఉంటుంది. నిన్నటిరేయి ఊరూ వాడా అంతా కొత్త సంవత్సరం సంబరాల్లో మునిగితేలారు. ముఖాల్ని మతాబుల్లా వెలిగించి, ఆకాశాన్ని తారాజువ్వలతో వెలిగించి సంబరాలు చేసుకున్నారు. యూత్ అయితే మందు - చిందు - పందెం అంటూ రచ్చ రచ్చ చేశారు. కట్ చేస్తే వీళ్లందరిపైనా వర్మ తనదైన శైలిలో స్పందించాడు.
అయితే ఈ సంబరాల్లో మునిగి తేలకముందే, అందరికీ తనదైన శైలిలో పంచ్ ఇచ్చారు వర్మ. అతగాడి ట్వీట్ చదివినవారికి కొత్త సంవత్సరం రాకుండానే చెమటలు పట్టేశాయ్. కంగారు పడకండి. ముందుంది ముసళ్ల పండుగ. పోయింది పాత సంవత్సరం, వచ్చింది కొత్త సంవత్సరం అని పాటేసుకుంటున్నారు కానీ, పెళ్లాం - గాళ్ ఫ్రెండ్ - ఉద్యోగం - సమస్యలు ... అన్నీ పాతవేగా అంటూ వర్మ ఓ రేంజులో పదప్రయోగం చేశారు. నిజమే మరి పాత పెళ్లాం బోర్, పాత గాళ్ ఫ్రెండ్ పరమ బోరింగ్. ఉద్యోగం ఛీఛీ. సమస్యలు ఛీఛీఛీ అనుకునేవాళ్లందరికీ వర్మ మాటతో చెవిలో అమృతం పోసినట్టే ఉంది.
వర్మ పేల్చే ప్రతి తూటా వినేవాడి పెదవులపై చిరునవ్వుల్ని పుష్పింపజేస్తుంది సుమీ. దటీజ్ వర్మ. అందుకే అతడి సినిమాల కంటే ట్విట్టర్ లో కామెంట్ల గురించే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అవునా? కాదా?