Begin typing your search above and press return to search.

అతడు వర్మకంటే పిచ్చొడంటున్న వర్మ!

By:  Tupaki Desk   |   4 Nov 2016 5:30 PM GMT
అతడు వర్మకంటే పిచ్చొడంటున్న వర్మ!
X
జనరల్ టాపిక్స్ విషయంలో సంచలనాలు అనే పదానికి, సినిమాల విషయంలో ఫ్రీ పబ్లిసిటీ అనేదానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు రాం గోపాల్ వర్మ అని ఆయన అభిమానులు పిలుచుకుంటుంటారు! ఆయన చేసే పనులు, స్పందించే విషయాలు, స్పందించే తీరు కూడా వాటికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. అర్ధం కానివారి సంగతి కాసేపు పక్కనపెడితే... అర్ధం అయినవారికి ఆయనొక ఆదర్శ పురుషుడు, మేధావి! ఇలాంటి వ్యక్తిపై పి.హెచ్.డి. చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రవీణ్ యజ్జల అనే ఔత్సాహిక విద్యార్థి. ఈ విషయాలపై రాం గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

"కన్న కూతురే నన్ను జూ పార్క్ లోనో ఇంకెక్కడో బంధిస్తే బాగుంటుందని భావిస్తుంది. అలాంటిది నా గురించి పి.హెచ్.డి. చేయడమా? నన్ను పి.హెచ్.డి. సబ్జెక్ట్ గా ఎంచుకున్న వ్యక్తి బహుశా నాకంటే ఎక్కువ పిచ్చోడై ఉంటాడు" అని ఆంధ్రా యూనివర్సిటీలో తనపై పి.హెచ్.డి. చేస్తోన్న విద్యార్థిని ఉద్దేశించి రాంగోపాల్ వర్మ అన్నారు.

కాగా, ప్రవీణ్ యజ్జల అనే ఔత్సాహిక విద్యార్థి పి.హెచ్.డి. కోసం "రాం గోపాల్ వర్మ వ్యక్తిత్వం, సినిమాలు - మనో పరిశీలన" అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్రా విశ్వవిద్యాలయం వారికి తన థీసీస్ ను సమర్పించాడు. ఈ విషయం తెలిసిన అనంతరం వర్మ ట్విట్టర్ లో ఇలా తనదైన శైలిలో స్పందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/