Begin typing your search above and press return to search.
తనకు జబ్బు లేదన్న వర్మ
By: Tupaki Desk | 22 Dec 2017 8:30 AM GMTవిలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంచుకునే కథలు ఎంత వివాదస్పదంగా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక వేళ అవి సాధారణమైన కథలు అయినా సరే వర్మ చేతిలో పడితే కాంట్రవర్షియల్ కావాల్సిందే. ఇక సినిమాల వల్ల మొన్నటి వరకు వివాదాలను తెరపై చూపించిన వర్మ ఇపుడు డైరెక్ట్ గా యూట్యూబ్ ద్వారా వెబ్ సిరీస్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు.
కడప అనే వెబ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కడపలో ఫ్యాక్షన్ అలాగే రెడ్డి సామజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వెబ్ సిరీస్ రూపొందించడం ఆ ప్రాంత వాసులకు నచ్చడం లేదు. కొందరు రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో వర్మకు వార్నింగ్ లు ఇస్తున్నారు. అతనికి పబ్లిసిటి పిచ్చి బాగా పట్టిందని అందుకే అలా ప్రవరిస్తున్నాడని అంతే కాకుండా మానసిక జబ్బుతో వర్మ ఉన్నాడని చెప్పారు.
అయితే వర్మ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా వార్నింగ్ లు ఇచ్చినా తనదైన శైలిలో వివరణ ఇస్తున్నాడు. తనకు ఎలాంటి జబ్బు లేదని చెబుతున్నాడు. ఇక వార్నింగ్ లు ఇచ్చిన వారి గురించి కూడా వర్మ సెటైరికల్ గా కౌంటర్లు ఇవ్వడం ఇప్పుడు మీడియాల్లో వైరల్ అవుతోంది.