Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డి@ కథ.. దర్శకత్వం వర్మ
By: Tupaki Desk | 18 April 2018 6:14 PM GMT సంచలనాల వర్మ భారీ సంచలన అంశాన్ని బయటపెట్టారు. గడిచిన రెండు.. మూడు రోజులుగా సినీనటి శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యకు సంబంధించిన ఆయన ఒక సంచలన అంశాన్ని బయటపెట్టారు. శ్రీరెడ్డి పోరాటం నచ్చి.. ఆమె పోరాటం పతాక స్థాయికి చేరేందుకు వీలుగా పవన్ ను వివాదాస్పద రీతిలో తిట్టాలన్న ఐడియాను తాను ఇచ్చినట్లుగా వెల్లడించారు.
దాదాపు పదిహేను నిమిషాలకు పైనే ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేసిన వర్మ.. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లేందుకు వీలుగా తానే ఆమెకు అలా తిట్టాలన్న ఐడియా ఇచ్చానని.. అందులో పూర్తి బాధ్యత తనదేనని.. శ్రీరెడ్డికి సంబంధం లేదని.. తన ప్రభావంతోనే ఆమె ఆ తరహాలో మాట్లాడినట్లు వెల్లడించారు. తనకు శ్రీరెడ్డికి ఎలా పరిచయంతో మొదలు.. తన కారణంగా బాధ పడిన పవన్ కు.. ఆయన ఫ్యాన్స్ కు సారీ చెబుతున్నట్లుగా చెప్పారు. వర్మ విడుదల చేసిన వీడియోలో ఆయనేం చెప్పారన్నది వర్మ మాటల్లోనే చూస్తే..
గాయత్రి గుప్తా వీడియో చూశా. ఇప్పుడే ఎవరో ఒకరు వీడియో పంపారు. శ్రీరెడ్డికి సంబంధించి నా వరకు నేను చెప్పాలనుకునే ఈ వీడియో చేస్తున్నాను.
శ్రీరెడ్డిని నేను అస్సలు కలవలేదు.రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో నాతో ఫోటో దిగింది. అప్పట్లో ఆమె నాతో ఫోటో దిగటం నాకు గుర్తు కూడా లేదు. ఈ వివాదం మొదలయ్యాక నాతో దిగిన ఫోటోను చూశాను. ఈ ఇష్యూ మొదలయ్యాక ఒక అమ్మాయి అట్లాంటి లాంగ్వేజ్ లో మాట్లాడటం సర్ ప్రైజ్ కు గురయ్యా. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పటం.. అదంతా నిజామా కాదా? అన్నది సీరియస్ గా ఎవరూ చూడలేదు.
తను చేసిన డిమాండ్లు కొన్ని సమంజసంగా.. మరికొన్ని అసమంజనంగా అనిపించాయి. తనకు తెలీదు.. దాని మీద అవగాహన లేక అలా మాట్లాడుతుందని అనుకున్నా. నా వేరే పనులు నేను చేసుకుంటున్నా. అప్పుడప్పుడు ఆమెకు సంబంధించిన విషయాలు ముక్కలు ముక్కలుగా నా దృష్టికి వచ్చాయి.
ఎప్పుడైతే మా అసోసియేషన్ భవనం ఎదుట తాను స్కిఫ్ట్ చేసిందో ఒక్కసారిగా ఆమె మీద చూశా. ఆ అమ్మాయి నడిచి వచ్చిన విధానం కానీ.. ఆము ముఖ కవళికల్లో కానీ చాలా తేడా ఉంది. గతంలో ఉన్న వీడియోలకు.. ఆ రోజు ఆ అమ్మాయి నడకలో ఏదో తేడా వచ్చిందని.. తన పర్సనాలిటీలో వ్యత్యాసం వచ్చిందన్నది నాకర్థమైంది.
నడకలోనూ.. బట్టలు తీసిన అమ్మాయి.. గతంలో చేసిన ఆ అమ్మాయి పనులకు ఆ రోజు పనులకు సంబంధం లేదనిపించింది. ఆమె బయటపెట్టిన సురేశ్ బాబు కొడుకు కానీ ఎక్స్ కానీ వై కానీ ఆ పేర్లను వదిలేస్తే.. ఆమె మాట్లాడిన మాటలు నా మీద ప్రభావం చూపించాయి. రెండు రోజుల తర్వాత.. కొంత ప్రయత్నం చేస్తే ఆమె నెంబరు నాకు దొరికింది. నేను ఆర్జీవీని.. నీతో మాట్లాడాలనుకుంటున్నా అని మెసేజ్ పెట్టిన తర్వాత తను ఫోన్ చేసింది.
క్యాస్టింగ్ కౌచ్ మీద నాకున్న అభిప్రాయాలకు.. తన అభిప్రాయాలకు సంబంధించి కొన్ని కలవటం.. తాను ఆ విషయం మీద ఇప్పటికే చాలా అఛీవ్ చేసింది. తనను అభినందించా.
శ్రీరెడ్డి వ్యవహారం మీద సురేశ్ బాబుతో మాట్లాడినప్పుడు.. ఎంత నా కొడుకైనా తను తప్పు చేస్తే అందుకు తగ్గ శిక్ష అనుభవించాల్సిందే. అదే సమయంలో తను తప్పు చేయకపోతే ఆ కేసు నుంచి బయటపడతాడన్నాడు. సురేశ్ బాబు ఎంతోకాలంగా నాకు మంచి స్నేహితుడు. తనేదో తాను చెప్పాడు. కానీ.. అంత పెద్ద రామానాయుడు సంస్థ.. ఆ కుటుంబం మీద మచ్చ పడితే బాగోదన్న ఉద్దేశంతో నేనే శ్రీరెడ్డికి ఫోన్ చేశా. తనతో మాట్లాడుతూ.. నువ్వు సాధించాలనుకున్నది సాధించావ్. ఇప్పుడు కేసుల కారణంగా ఒరిగేదేమిటి? అని అడిగా. ఎందుకంటే.. చట్టం వరకూ చూస్తే.. మగాళ్లతో పోలిస్తే.. మహిళల విషయంలో కొంత సానుకూలత ఉంటుంది.
ఇప్పటికి జరగాల్సింది జరిగిపోయింది. డ్యామేజ్ అయ్యిందేదో అయ్యింది. ఒకవేళ కేసు వగైరా చేసినా.. దాని వల్ల ఆ కుటుంబానికి ఇబ్బందే తప్పించి.. ఆమె చేస్తున్న కాజ్ కు.. తన వరకు తనకు ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమీ ఉండదు. ఈ విషయం మీద సురేశ్ తో నేనేమీ మాట్లాడలేదు. చట్టం ఏం చేస్తే దానికి తాను బద్ధుడ్ని అయి ఉంటానని బలంగా ఉన్నాడు. సురేశ్ తో నేను ఏ మాటా మాట్లాడలేదు కూడా. నేను అవుటాఫ్ వే వెళ్లి ఏమీ చేయనని నాకు స్వయంగా చెప్పాడు. చాలామందికి అదే మాట చెప్పాడు.
కానీ.. నా వరకు నాకు అభిరామ్ తో సంబంధం లేకున్నా వారి కుటుంబానికి మనోవ్యధ కలగకుండా చేద్దామనుకున్నా. సురేశ్ తో కాకుండా వారి కుటుంబంలోని వారితో ఎవరితోనైనా మాట్లాడి ఈ ఇష్యూను క్లోజ్ చేసేందుకు రూ.నాలుగైదు కోట్లతో సెటిల్ చేద్దామని ప్రపోజల్ పెట్టా. నా వరకు నాకు శ్రీరెడ్డి ఓకే అంటే.. ఏదోలా వారిని కన్వీన్స్ చేయటం.. ఒకసారి ఇష్యూ సెటిల్ అయిపోతే.. ఈ ఎపిసోడ్‌లో శ్రీరెడ్డికి ఒక పెద్దకుటుంబం సపోర్ట్ ఉంటుందని భావించా. అదే విషయాన్ని శ్రీరెడ్డికి చెప్పా. నువ్వు కనుక ఈ డీల్ ఓకే అంటే.. ఆ కుటుంబానికి ఇబ్బందితో పాటు.. నీకు లైఫ్ సెటిల్ మెంట్ అయిపోతుందని చెప్పా. కానీ.. తాను మాత్రం నో చెప్పింది. అది నా జీవితంలోనే నాకు ఎదురైన అతి పెద్ద షాక్. ఎందుకంటే..శ్రీరెడ్డి పొజిషన్లో ఎవరున్నా సరే.. మరో మాటకు తావు లేకుండా ఓకే చెబుతారు. కానీ తాను మాత్రం అలా చేయటం ఇష్టం లేదండని చెప్పింది.
నేనో కాజ్ కోసం పని చేస్తున్నా.. ఈ ఇష్యూలో నేను డబ్బులు తీసుకుంటే.. అద్దంలో నా ముఖం నేను చూసుకోలేనని చెప్పి.. ఇష్యూ సెటిల్ చేసేందుకు నో చెప్పేసింది. అంత పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేసినా తను నో చెప్పటం.. తాను చేసే పోరాటంపై తనకున్న పట్టుదల ఇంప్రెస్ అయ్యేలా చేసింది. తాను చేసే పోరాటానికి సంబంధించిన విషయాలపై నా అభిప్రాయాలు వేరే ఉన్నా.. ఆ అమ్మాయికి ఉన్న చిత్తశుద్ధి ఇంప్రెస్ అయ్యేలా చేసింది.
నడి రోడ్డు మీద బట్టలు విప్పదీయటం అంటే అంత చిన్న విషయం కాదు.అలాంటి ఎక్స్ ట్రీమ్ పని చేసినప్పుడు మాత్రం అందరూ దృష్టిసారిస్తారు.తనేం చెబుతుందో వినే ప్రయత్నం చేస్తారు. ఏ ఫైట్ లో అయినా.. చాలా స్ట్రాంగ్ పనులు చేయాలి. రాజకీయ నాయకులు ఎవర్నో తిట్టో.. ఛాలెంజ్ చేస్తే లైమ్ లైట్ లోకి వస్తారు. అలా లైమ్ లైట్ లోకి రావటానికి ఐదారు సలహాలు ఇచ్చా. అందులో ఒకటి.. బిగ్గెస్ట్ స్టార్ ను ఏమైనా అంటే ఆమె పాపులార్టీ మరింత పెరుగుతుంది. ఉదాహరణకు కత్తి మహేశ్ ఎవరో ఎవరికి తెలీదు. కానీ.. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ ను అన్నాడో అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. తన మాటల్లో లాజిక్. . సెన్స్ ఉండొచ్చు. కానీ.. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశాడో అప్పుడు మాత్రమే అటెన్షన్ వచ్చింది.
అలానే.. పవన్ కల్యాణ్ లాంటి స్టార్ ను తిట్టమని నేనే సలహా ఇచ్చా. అందులో నా ఉద్దేశం ఏమిటంటే.. అర్జున్ రెడ్డి సినిమాలో ఏం మాట్లాడుతున్నావురా.. అంటే తిట్టేయటం.. ఆ బూతుమాటకు విజయ్ దేవరకొండ ఇచ్చిన వివరణ తెలుగు ప్రజల్లోకి వెళ్లిపోవటంతో.. ఆ పదాన్ని వాడమని నేనే చెప్పా. ఆవేశంతో ఉన్నప్పుడు నోట్లో నుంచి మాటల ఎక్స్ ప్రెషన్ వేరుగా ఉంటుంది. ఏదో ఒక సమయంలో కేసీఆర్ ను పవన్ కల్యాణ్ తాట తీస్తా అని ఉండొచ్చు. అదే సమయంలో కేసీఆర్.. నేను వెయ్యి ముక్కలు చేస్తానని అని ఉండొచ్చు. ఒక ఎమోషన్ ఉన్నప్పుడు ఒక తిట్టు కానీ మరొకటి కానీ చాలా తీవ్రంగా వస్తాయి. అదే పవన్ కల్యాణ్ ఒక టైమ్ అయ్యాక కేసీఆర్ తో కలిసి లంచ్ చేసి తినొచ్చు. అలా మనం అందరం చేస్తాం.
ఒక అమ్మాయి అర్జున్ రెడ్డి లా ఒక మాట అంటే ఎలా ఉంటుంది? ఆ మాట మాట్లాడమని నేనే సలహా ఇచ్చా. అందుకని నా ఉద్దేశంలో తను ఆ మాట అన్నది సలహాతోనే ఆమె అలా మాట్లాడింది. ఇప్పుడు ఇందులో నా ఉద్దేశం నేను చెప్పా. ఈ విషయంలో ఎవరైనా ఏదైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే అది నేనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఇష్యూలో ఆమె సమాధానం చెప్పలేకపోతోంది. నా వరకు నాకు నైతిక బాధ్యత ఉంది. అందుకే నాకు నేనే ఈ విషయాన్ని బయటకు చెప్పాలనుకున్నా. అందుకే చెబుతున్నా. ఎప్పుడైనా ఒకరిని ప్రభావితం చేసినప్పుడు దాని రెస్పాన్స్ బులిటీ నాదని చెప్పటానికి వీడియో పెట్టాను.
ఈ విషయంలో పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు. ఈ విషయంలో ఎవరు హర్ట్ అయినా వారికి నేనే క్షమాపణలు చెబుతా. నాకు ఇప్పటికి కూడా.. ఏడాది.. రెండేళ్ల క్రితం ఆమె వేరు. ఇప్పుడు వేరు. మా అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఆ విషయాన్ని నేను వ్యక్తిగతంగా గమనించాను. ఒక ఫిలిం మేకర్ గా గమనించా. ఆ అమ్మాయి కారణంగా క్యాస్టింగ్ కౌచ్.. తక్కువగా చేసి చూడటం లాంటి అంశాల మీద చర్చ జరుగుతోంది. ఆ విషయంలో ఆ అమ్మాయే కారణం. అందుకని మిగిలినవన్నీ అంటే.. గాయత్రి గుప్తా చెప్పేవి.. మిగిలిన వీడియోలు నాకు తెలియనివి. నేను చెప్పేది రెండే విషయాలు. నేను సురేశ్ కు తెలీకుండా సాయం చేయాలనుకున్నప్పుడు రూ.5 కోట్లు ఇప్పిస్తానంటే నో చెప్పింది. పవన్ కల్యాణ్ ను ఆ అమ్మాయి అలా మాట్లాడేలా ప్రభావితం చేసింది నేనే. అది నా ఐడియానే. మళ్లీ చెబుతున్నాను.. పవన్ కు.. ఆయన ఫ్యాన్స్ కు సారీ. వాళ్లు హర్ట్ అయ్యారు.. మరోసారి సారీ.
వీడియో కోసం క్లిక్ చేయండి