Begin typing your search above and press return to search.
పవన్ డైరక్షన్లో మెగాస్టార్ 150వ సినిమా
By: Tupaki Desk | 20 July 2015 4:05 AM GMTఅబ్బే ఎక్కువగా ఊహించుకొవద్దు. ఇది కూడా ఒక మెగా ఊహ మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా పై ఎవరికీ ఎలాంటి శ్రద్ధ వున్నా లేకపోయినా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మాత్రం ఆయన సొంత సినిమా కంటే ఎక్కువ ఇంట్రస్ట్ ఈ ప్రాజెక్ట్ పైన. అందుకే మూడ్ వచినప్పుడల్లా తోచిన ఐడియాలు ఇస్తుంటాడు.
"చిరంజీవి 150వ సినిమాని ఏ ఇతర దర్శకులు అయినా బాహుబలిని మించి తీయలేరని మెగా అభిమానులందరం అనుకుంటున్నాం" అని సెలవిచ్చాడు రాము. కేవలం చిరు దర్శకత్వం వహిస్తేనే తన150వ సినిమా ఉన్నత శిఖరాలను చేరుతుందని ట్విట్టర్ ద్వారా కామెంట్ చేసాడు. ఒక వేళ చిరంజీవి కాకపోతే ఆ సినిమాకి దర్శకత్వం పవన్ చేయాలని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తే అది బాహుబలిని మించుతుందట. పవన్ కళ్యాణ్ దర్వకత్వంలో మెగా స్టార్ చిత్రం వస్తే అంతకు మించిన పెద్ద సినిమా ఉంటుందా అని నేను నిజాయితిగా మెగా అభిమానులను అడుగుతున్నాను అంటూ ట్విట్ చేశారు.
ఒక పవన్ కళ్యాణ్ తన సొంత గబ్బర్ సింగ్ 2 స్టార్ట్ చెయ్యడానికే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా మెగాస్టార్ 150వ సినిమా అంటే టైం ఎక్కడనుండి తెస్తాడు? అంతే కాదు వర్మ కోరికలన్నీ తీర్చుకుపోతే ఇక మెగా క్యాంపు కి వేరే సినిమాలు చేస్కొనే ఛాన్స్ ఉండదు. అయినా మీ శిష్యుడు పూరి ని వదిలేసి కొత్తగా పవన్ కళ్యాణ్, రాజమౌళి అంటున్నారు ఏంటి సార్?