Begin typing your search above and press return to search.

వర్మ సారీలతో పనవుతుందా అసలు?

By:  Tupaki Desk   |   19 April 2018 10:22 AM GMT
వర్మ సారీలతో పనవుతుందా అసలు?
X
దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ వ్యవహారం. తనకు సంబంధం ఉన్నా లేకపోయినా.. నచ్చినట్లుగా మాట్లాడడం.. ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేయడంతోనే.. ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలో తలదూర్చి ఎదురు దెబ్బ తినేసి సారీలు చెబుతున్నాడు.

శ్రీరెడ్డి తప్పేమీ లేదు.. అంతా తానే చేశానంటూ ఓ పెద్ద వివరణ ఇఛ్చి పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ కు తెగ క్షమాపణలు చెబుతున్నాడు రాంగోపాల్ వర్మ. వీడియోలోనే బోలెడన్ని సారీలు.. ఆ తర్వాత ట్విట్టర్ టైంలోని మరిన్ని సారీలు చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ ను అన్న మాట చిన్నదేమీ కాదు. ఇప్పుడు చేయాల్సినదంతా చేసి.. పైగా పవన్ ను అంత పెద్ద బూతు మాట అనిపించేసి.. ఇప్పుడు శ్రీరెడ్డిని ఓ విప్లవ వనితగా ప్రొజెక్ట్ చేస్తూ.. పవన్ కు సారీలు చెబుతుండడం.. ఫ్యాన్స్ కు రుచిస్తుందా అన్నదే పాయింట్. నిజానికి వర్మ ఇలా చేయడం ఇదే మొదటి సారి అయితే.. మెగా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. కానీ ఇప్పటికి వర్మ ఇలా చేయడం ఎన్నిసారో లెక్కించడం కష్టం.

పైగా తనే ఈ విషయాన్ని పశ్చాత్తాపంతో చెబుతున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాడు కానీ.. వర్మ ప్రోద్బలంతోనే శ్రీరెడ్డి అలా మాట్లాడిందనే విషయం అప్పటికే మీడియాలో లీక్ అయిపోయింది. ఆ తర్వాత తాను డీటైల్డ్ గా చెప్పాడంతే. ఆ సంగతేమో కానీ.. ఇప్పుడు వర్మ చెబుతున్న సింపుల్ సారీలు.. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని కంట్రోల్ చేయడం కాసింత కష్టమే.