Begin typing your search above and press return to search.
బ్రదర్ అనిల్ తో వర్మ ఏం మాట్లాడారు?
By: Tupaki Desk | 16 Oct 2017 7:14 AM GMTనిత్యం వార్తల్లో ఉండటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. కానీ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు మాత్రం ఇది చాలా తేలికైన పని. ఎప్పుడు.. ఎలా.. ఎందుకు.. ఎవరి మీద స్పందిస్తారో తెలీని రీతిలో రియాక్ట్ అయ్యే వర్మ ఇటీవల ఆయన తీస్తున్నట్లు ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం హాట్ టాపిక్ గా మారింది.
సినిమా.. రాజకీయ రంగాల్లో ఒకేసారి సంచలనంగా మారిన ఈ మూవీకి సంబంధించిన చర్చ ఓపక్క సాగుతున్న వేళలోనే.. మరో కొత్త విషయం బయటకు వచ్చింది. అదేమంటే.. ఈ సినిమాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత నిర్మాత అన్న విషయం వెలుగులోకి రావటం ఒక సంచలనమైతే.. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ ను ఒక ఫైవ్ స్టార్ హోటల్లో భేటీ అయ్యారు.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీస్తున్న వర్మ.. జగన్ బావ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ తో భేటీ ఎందుకయ్యారు? వారేం మాట్లాడుకున్నారన్నది అందరిలో ఆసక్తి వ్యక్తమైంది. ఈ అంశంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు వర్మ.
తాను హైదరాబాద్ వచ్చినప్పుడు పార్క్ హయత్ లో ఉంటానని.. ఆ సమయంలో బ్రదర్ అనిల్ అక్కడే ఉండటంతో ఆయన్ని కలిసినట్లుగా చెప్పారు. తమ మధ్య జరిగిన భేటీలో ఎక్కువగా క్రిస్టియానిటీ గురించే బ్రదర్ అనిల్ మాట్లాడారని.. సినిమా గురించి టాపిక్కే రాలేదని స్పష్టం చేశారు.
మిమ్మల్ని కూడా క్రిస్టియానిటీలోకి మారమన్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు..అలాంటిదేమీ లేదని. . తనను మార్చాలనుకునేంత అమాయకుడెవరూ ఉండరని బదులిచ్చారు. నిజమే.. వర్మ లాంటి వ్యక్తితో ఎవరైనా మాట్లాడతారు కానీ.. సలహాలు.. సూచనలు.. సందేశాలు ఇచ్చే ధైర్యం చేస్తారా?