Begin typing your search above and press return to search.
తిరుపతిలో వర్మ సెన్సేషన్
By: Tupaki Desk | 18 Oct 2018 1:29 PM GMTఏది చేసినా సంచలనానికి తక్కువ స్థాయి కాకుండా చేసే రామ్ గోపాల్ వర్మ మొత్తానికి మరో బాంబును రెడీ చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం లక్ష్మీస్ ఎన్టీఆర్ ను కంటిన్యూ చేయబోతున్నట్టు వర్మ ప్రకటించగానే అందరు కొట్టిపారేశారు. ఇలా చెప్పడం మానేయడం మాములే కదా అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. వాటిని సీరియస్ గా తీసుకున్నాడు కాబోలు వర్మ లైన్ లోకి వచ్చి కాస్త గట్టి క్లారిటీనే ఇస్తున్నాడు. రేపు ఉదయం ఆరు గంటలకు వర్మ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోబోతున్నాడు. వర్మ వీరాభిమానులకు ఇది షాక్ ఇచ్చే న్యూస్ కానీ మిగిలిన వాళ్లకు ఇందులో విశేషం ఏముందబ్బా అనిపించడం సహజం. అక్కడే ఉంది కిటుకు.
వర్మ పక్కా నాస్తికుడు. దేవుణ్ణి నమ్మడు. ఇప్పటి దాకా వర్మ ఇచ్చిన ఏ ఇంటర్వ్యూ చూసినా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ దేవుడిని నమ్మని తాను జీవితంలో మొదటిసారి తిరుపతి దర్శనానికి వెళ్తున్నానని చెప్పాడు. దాని తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరుపతి శిల్పారామంలో ప్రెస్ మీట్ ద్వారా లక్ష్మీస్ ఎన్టీఆర్ విశేషాలు వివరాలు ప్రకటించబోతున్నాడట. సో మొత్తానికి ఈ సినిమా కార్యరూపం దాల్చడం నిజమే. అయితే ఇదేదో హైదరాబాద్ లో చేస్తే పోయేదిగా తిరుపతికి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్నకు కూడా రేపే సమాధానం దొరకొచ్చు.
వర్మ ఎంత నాస్తికుడైనా దేవుడి నేపధ్యంలో నాగార్జున హీరోగా గోవిందా గోవిందా తీసాడు. ఏకంగా తిరుపతి గుడి సెట్ వేయించి మరీ భారీగా ఖర్చు పెట్టించాడు. కానీ అది డిజాస్టర్ గా మిగిలింది. దాని తర్వాత మళ్ళి ఆ జానర్ ను వర్మ టచ్ చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత దేవుడి దర్శనం చేసుకున్నాక లక్ష్మిస్ ఎన్టీఆర్ గురించి చెబుతాను అన్నాడు అంటే సంథింగ్ ఏదో ఉండబోతోంది అనే సూచన అయితే కనిపిస్తోంది. మరి వర్మ రేపు సాయంత్రం ఏ బాంబులు పేల్చబోతున్నాడో వేచి చూడాలి. అచ్చం చంద్రబాబుని పోలిన వ్యక్తిని ఇప్పటికే పట్టేసుకున్న వర్మ మిగిలిన ఆర్టిస్టుల సెలక్షన్ లో ఉన్నాడు.