Begin typing your search above and press return to search.
ఆ విషయంపై కీరవాణి పట్టుబట్టాడు...వర్మ!
By: Tupaki Desk | 21 Jan 2018 6:30 PM GMTఓ ఇంటర్వ్యూలో జీఎస్టీ ‘గాడ్ - సెక్స్ అండ్ ట్రూత్’ గురించి మాట్లాడిన వర్మ అక్రమ సంబంధాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎఫైర్స్ పై కూడా వర్మ తనదైన శైలిలో స్పందించారు. భార్యాభర్తలు - ప్రేమికులు.....స్త్రీపురుషుల మధ్య కొన్ని కారణాల వల్ల ఒకరిపై ఒకరికి ఆసక్తి - ఫీలింగ్స్ తగ్గిపోయినపుడే వేరేవాళ్లతో ఎఫైర్స్ పెట్టుకోవాలనిపిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అలా అని అందరూ రిలేషన్స్ వదిలేసి ఎఫైర్స్ పెట్టుకోమని తాను చెప్పడం లేదని.....కేవలం కమిట్ మెంట్ ఉంది కాబట్టే వేరే వాళ్లతో సెక్స్ చేయకూడదనే ని`బంధనాలు` వేసుకొని - ఆత్మక్షోభ అనుభవించడం కరెక్టా అని వర్మ ప్రశ్నించారు. స్త్రీ పురుషులిద్దరూ ఒకరిపై ఒకరు సెక్స్ విషయంలో అవగాహన కలిగిఉండాలని - ఆసక్తి - స్వేచ్ఛ - పరిమితుల గురించి ఇద్దరూ కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరముందనేది తన ఉద్దేశమని చెప్పారు.
ఈ వీడియోకు సంగీతం అందించాలని కీరవాణిని తాను కలిశానని - వేరే ఏ సంగీత దర్శకుడు ఈ వీడియోకు న్యాయం చేయలేడని చెప్పానన్నారు. ఇష్టముంటేనే మ్యూజిక్ కంపోజ్ చేయమని అడిగానని - ప్రస్తుతం ఆయనకున్న ఇమేజ్ ప్రకారం....తన వీడియో టైటిల్స్ లో పేరు వేయడం ఇష్టం లేకున్నా పర్లేదని చెప్పానన్నారు. అయితే, ఆ వీడియో చూసిన తర్వాత కీరవాణి.....మ్యూజిక్ కంపోజింగ్ కు ఒప్పుకోవడమే కాకుండా....తన పేరు కచ్చితంగా వేయాలని అడగడంతో తాను షాక్ అయ్యానని వర్మ చెప్పారు. కీరవాణి చాలా లోతుగా ఆలోచించే వ్యక్తని - తన వీడియో కాన్సెప్ట్ లోని నిజాయితీ నచ్చి ఆయన ఒప్పుకున్నారని అన్నారు. అందుకే `జీఎస్టీ` మ్యూజిక్ లో ఓ పవిత్రత మీకు వినిపిస్తుందని, ఆయన తన కాన్సెప్ట్ ను ఫీల్ అయ్యాడు కాబట్టే....అద్భుతమైన సంగీతం ఇవ్వగలిగాడన్నారు.