Begin typing your search above and press return to search.
వంగవీటిపై గీత దాటేసిన వర్మ
By: Tupaki Desk | 4 Sep 2017 8:34 AM GMTతన మాటలతో మంట పుట్టించటం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే. కొద్దికాలం క్రితం వరకూ ట్విట్టర్‌లో అదేపనిగా ట్వీట్ చేస్తూ ఎన్ని సంచలనాలు.. మరెన్ని వివాదాలకు తెర తీశారో తెలియంది కాదు. ట్విట్టర్ ను వదిలేసి ఫేస్ బుక్ ను వేదికగా చేసుకొని పలు అంశాల మీద రియాక్ట్ అవుతున్నారు.
తాజాగా వంగవీటి ఫ్యామిలీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమే కాదు.. పెను దుమారానికి తెర తీస్తున్నాయి. బెజవాడలో నిన్న చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన వంగవీటిరాధా.. ఆయన తల్లి రత్నకుమారిల ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరు వర్మ పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచి పద్దతికాదంటున్నారు. వంగవీటి హత్యపై గౌతంరెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపటం.. దీనిపై వంగవీటి సతీమణి.. కుమారుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే.
తనకు వంగవీటి రాధా.. అతని తల్లి వంగవీటి రత్నకుమారి అంటే చాలా ఇష్టమని.. వీరిద్దరిని చూసి స్వర్గంలో ఉన్న రంగా ఆనందిస్తారన్నారు. గర్వంగా ఫీలై.. స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ కూడా చేస్తారన్నారు.
తల్లి ఎందుకు నల్లగా ఉందో.. కొడుకు ఎందుకు తెల్లగా ఉన్నాడో లోరియల్ కాస్మొటిక్ కంపెనీ చెప్పాలంటూ చేసిన పోస్ట్ కూడా పెను దుమారమే రేగుతోంది. వ్యక్తిగత విషయాలను ఈ తరహాలో ప్రస్తావించటం ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు. తాను పోస్ట్ చేసిన పోస్టులపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. వర్మ దీనికేం బదులిస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వంగవీటి మూవీ తీసిన టైంలో వంగవీటి కుటుంబ సభ్యులు సహకరించలేదన్న అక్రోశంతోనే ఈ తరహా పోస్టులు పెడుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.