Begin typing your search above and press return to search.
కత్తికి తన భయాన్ని చెప్పుకున్న వర్మ
By: Tupaki Desk | 23 Jan 2018 9:50 AM GMTవిషయం ఏదైనా సరే.. మనసుకు అనిపించిన వెంటనే మరో ఆలోచన లేకుండా నోటితోనో.. లేదంటే ట్వీట్ తోనో షేర్ చేసుకోవటం వివాదాస్పద దర్శకుడు వర్మకు అలవాటు. నిత్యం వివాదాల్లో మునిగితేలే ఆయనకు బోల్డ్ నెస్ ఎక్కువన్న మాట చెబుతుంటారు. దీనికి తగ్గట్లే తాజాగా ఒక పోర్న్ స్టార్ తో సెక్స్ మూవీని తీసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
అయితే.. అది మొయిన్ స్ట్రీమ్ చిత్రంగా కాకుండా వెబ్ వరల్డ్ లో ఈ నెల 26న విడుదల కానుంది. గాడ్ సెక్స్ ట్రూత్ అంటూ తీసిన ఈ వీడియో మూవీని ప్రపంచ వ్యాప్తంగా వెబ్ వరల్డ్ లో రిలీజ్ చేస్తున్న వర్మ తీరుపై పలువురు మండిపడుతుంటే.. వెబ్ లో లక్షల కొద్దీ పోర్న్ చిత్రాలు ఉంటే.. తన చిత్రం మీదనే ఎందుకు పడతారంటూ ఫైర్ అవుతున్నారు.
వర్మ వాదనకు మద్దతు ఇవ్వటమే కాదు.. ఆయన తీసిన గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) వీడియోపై సినీ విమర్శకుడన్న ట్యాగ్ వేసుకున్న కత్తి మహేశ్ ఒక ట్వీట్ చేశారు.
వర్మ తీసిన గాడ్ సెక్స్ ట్రూత్ ఫీచర్ లెంత్ ఉన్న సినిమా కాదని.. థియేటర్లలో విడుదల కాదని.. వెబ్ మీడియాకు సంబంధించిందని.. ఎందుకు దీనిపై ఇంత రభస చేస్తున్నారో తనకు అర్థం కావటం లేదన్నారు. వర్మ తీసినందుకే ఇలా చేస్తున్నారా? భారతదేశానికి.. సమాజానికి.. సంస్కృతికి అతను అంత పెద్ద ముప్పా? అంటూ ప్రశ్నల ట్వీట్ ను వదిలాడు.
కత్తి ట్వీట్‌కు వర్మ రియాక్ట్ అయ్యారు. ఆయన రీట్వీట్ చేస్తూ.. హే కత్తి మహేశ్.. నిరసనకారుల అజ్ఞానం చూస్తే నిజంగానే భయమేస్తుందంటూ తన పీలింగ్స్ ను షేర్ చేసుకున్నారు. విదేశీ నటులతో కూడిన పెద్దల వీడియోలు మిలియన్ల కొద్దీ అందుబాటులో ఉన్నాయని.. కానీ వాళ్లు విదేశీ నటితో తీసిన జీఎస్టీ వీడియో మీదనే నిరసన తెలుపుతున్నారంటూ కామెంట్ చేశారు. వర్మ లాంటోడు తన భయాన్ని కత్తితో షేర్ చేసుకోవటం గమనార్హం. ఎవరూ తనకు మద్దతుగా నిలవని వేళ.. కత్తి లాంటోడు ముందుకు వచ్చినప్పుడు.. వర్మ ఆ మాత్రం షేర్ చేసుకోకుండా ఉండరు కదా?