Begin typing your search above and press return to search.

'సైలెంట్‌'గా వర్మ సంచలనం

By:  Tupaki Desk   |   9 April 2015 4:53 AM GMT
సైలెంట్‌గా వర్మ సంచలనం
X
రామూ ఏం చేసినా సంచలనమే. అలాంటి సంచలనంతోనే మరోసారి ముందుకొస్తున్నాడు. ఈసారి మూకీ తీస్తున్నా అంటూ వార్తల్లోకొచ్చాడు. సినిమాలో సౌండ్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, సైలెన్స్‌కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అదే నా యుఎస్‌పి.. అని అంటున్నాడు.

హాలీవుడ్‌లో రిలీజైన మొట్టమొదటి మూకీ 'ది గ్రేట్‌ ట్రెయిన్‌ రోబరీ' (1903). దాదాపు పాతికేళ్ల తర్వాత అంటే 1927లో తొలి టాకీ 'జాజ్‌ సింగర్‌' రిలీజైంది. నాటి నుంచి టాకీ హవా కొనసాగింది. హాలీవుడ్‌వాళ్లు మూకీ తీసిన పదేళ్లకు మన భారతీయులు తొలి మూకీ తీయగలిగారు. 'రాజా హరిశ్చంద్ర' పేరుతో 1913లో మూకీ సినిమా తీశారు. 1932లో చివరి మూకీ ఆలం ఆరా వచ్చింది. తెలుగులో 1921లో తొలి మూకీ తీశారు. భీష్మ ప్రతిజ్ఞ అనేది టైటిల్‌. 1932లో భక్త ప్రహ్లద అనే టాకీ వచ్చే వరకూ మూకీ నడిచింది. టాకీ అనేది సాంకేతికంగా అడ్వాన్స్‌డ్‌ అనుకుంటున్న రోజుల్లో 50ఏళ్లకు 'సైలెంట్‌ మూవీ' పేరుతో ఒక మూకీ తీశాడు మెల్‌ బ్రూక్స్‌. పెద్ద హిట్టయ్యిందీ సినిమా. మాటలే లేని మూకీ ఎందుకు తీశావ్‌ అని బ్రూక్స్‌ని అడిగినప్పుడు షాకిచ్చే సమాధానమిచ్చాడాయన. ఆరోజుల్లోనే మాటల్లేని సినిమాని అర్థం చేసుకున్నప్పుడు ఈరోజుల్లో ఎందుకు అర్థం చేసుకోలేరు? అన్నదే అతడి సమాధానం.

ఇక తెలుగులో మూకీ ముగిసిపోయిన 60ఏళ్లకు సింగీతం శ్రీనివాసరావు 'పుష్పకవిమానం' అనే మూకీ తీసి ఆశ్చర్య పరిచారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఒక్క మూకీ కూడా రాలేదు. అందుకే 'సైలెంట్‌' మూవీ తీస్తున్నా అని వర్మ ట్విస్టిచ్చాడు. వర్మా! నువ్వేం చేసినా సెన్సేషనే గురూ!