Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డి కోపంలో పవన్ ను తిట్టి ఉంటుంది: వర్మ
By: Tupaki Desk | 18 April 2018 1:28 PM GMTనిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటు. సినిమా, రాజకీయాలు...ఇలా సమకాలీన విషయం ఏదైనా తనదైన శైలిలో వ్యాఖ్యానించడం ఆయనకు పరిపాటి. తన రామూయిజాన్ని వినిపించే క్రమంలో వర్మ కొన్ని సార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. తాజాగా వర్మ నటి శ్రీరెడ్డి, జనసే అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ లపై షాకింగ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తోన్న పోరాటం గురించి వర్మ రెండు రోజుల క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో శ్రీరెడ్డిని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చిన వర్మ....రెండు రోజుల క్రితం అశోకుడితో పోలుస్తూ ట్వీట్ చేశారు. ఎంతోమందిని బలితీసుకున్న తర్వాత నియంత అశోకుడి మనసు మారి గొప్ప చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడని,....అదే తరహాలో శ్రీరెడ్డి కూడా నిలిచిపోతుందని ట్వీట్ చేశారు వర్మ. తాజాగా, పవన్ ను అసభ్య పదజాలంతో దూషించిన శ్రీరెడ్డికి వర్మ మద్దతు తెలుపుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, ఆమెకు మహిళా సంఘాలు కూడా మద్దతు తెలపాలని కోరుతూ యూట్యూబ్ లో ఓ వీడియో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ ను దూషించిన శ్రీరెడ్డిపై సామాన్యులు, పవన్ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా మండిపడుతున్నారు. అయితే, అందరికీ భిన్నంగా వర్మ మాత్రం శ్రీరెడ్డి తిట్లను సమర్థించారు. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేక తిట్లు తిట్టడం సహజమని, దాదాపుగా చాలామంది కోపంలో ఏం తిడతారో వారికే తెలీదని వర్మ అన్నారు. అదే విధంగా శ్రీరెడ్డి కూడా ఆ పదజాలంతో పవన్ ను తిట్టిందని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాటకొస్తే పవన్ కల్యాణ్ అభిమానులు కొంతమంది....తిట్లు తప్ప మరేమీ రావన్నట్లు కామెంట్స్ పెడుతుంటారని, అది పవన్ పై అభిమానంతో ఆవేశంలో చేస్తారని అన్నారు. తన తల్లి, సోదరి, తాను కూడా పవన్ ఫ్యాన్సేనని, తాను పవన్ ని సీఎంగా చూడాలనుకుంటున్నానని వర్మ అన్నారు. పవన్ ను శ్రీరెడ్డి దూషించడం....ఆమె వాడిన భాష....గతంలో ఆమె వ్యవహార శైలి....ఇవన్నీ పరిగణలోకి తీసుకొని....ఆమె లేవనెత్తిన ముఖ్యమైన విషయాన్ని మరుగున పడేయవద్దని వర్మ కోరారు. తాను సినీ పరిశ్రమకు వచ్చి 30 ఏళ్లయిందని, అంతకు ముందు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. ఆ వ్యవహారం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉందని, శ్రీరెడ్డి పోరాటం వల్ల ఇప్పుడు ఆ విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోందని అన్నారు. శ్రీరెడ్డి పోరాటం వల్ల .....క్యాస్టింగ్ కౌచ్ కు పుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఇండస్ట్రీ పెద్దలు భావించి క్యాష్ కమిటీ పెట్టారని, ఆమె పోరాటం వల్లే ఈ విషయంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని అన్నారు. సామాజిక కార్యకర్తలు సంధ్య - దేవిలాంటి వారు శ్రీరెడ్డి తరఫున పోరాడాలని వర్మ కోరారు.
వీడియో కోసం క్లిక్ చేయండి