Begin typing your search above and press return to search.
శిష్యుడి గాలి తీసేసిన వర్మ
By: Tupaki Desk | 17 July 2015 5:50 PM GMTరాంగోపాల్ వర్మకు ఆవేశం వస్తే అంతే మరి. ఆ సమయానికి ఏదో అంటాడు. ఆ తర్వాత ఇంతకుముందు మీరిలా అన్నారు కదా అంటే.. ‘‘మీరు నమ్మేశారా’’ అనో.. ‘‘నేను మాట మీద నిలబడే టైపు’’ కాదు అంటూ తమాషా చేస్తాడు. నాలుగు నెలల కిందట ‘టెంపర్’ సినిమా రిలీజైన టైంలో తన శిష్యుడు పూరి జగన్నాథ్‌ను వర్మ ఆకాశానికెత్తేయడం.. చిరంజీవి 150వ సినిమాకు పూరికి మించి ఛాయిస్ లేదని స్టేట్మెంట్ ఇచ్చేయడం తెలిసిన సంగతే. ఐతే వర్మ మాటల ప్రభావమో ఏంటో కానీ.. నిజంగానే చిరంజీవి 150వ సినిమా బాధ్యత పూరీకే అప్పగించారు. కానీ ఇంతలోనే శిష్యుడి గాలి తీసేసే ట్వీట్లు చేశాడు వర్మ.
బాహుబలి సినిమా చూశాక అయిన జ్నానోదయం ప్రకారం చిరంజీవి 150వ సినిమాకు రాజమౌళే సరైన ఛాయిస్ అంటున్నాడు వర్మ. వారం రోజులుగా బాహుబలి సినిమాను, రాజమౌళిని పొగడ్డమే పనిగా పెట్టుకున్న వర్మ.. చిరు 150వ సినిమా బాధ్యతను కూడా రాజమౌళికే కట్టబెట్టాలంటున్నాడు. ‘‘రాజమౌళి మినహా చిరంజీవి 150వ సినిమాకు వేరెవ్వరూ న్యాయం చేయాలేరని అనుకుంటున్నా. చిరంజీవి 150వ సినిమా బాహుబలి కంటే మిన్నగా లేకుంటే అది ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కంటే పెద్ద తప్పవుతుంది. మెగాస్టార్‌కు బిగ్గెస్ ఫ్యాన్‌గా నేను, కోట్లమంది అభిమానులు చిరంజీవి 150వ సినిమా బాహుబలి కంటే మిన్నగా ఉండాలని కోరుకుంటున్నాం.
ప్రభాస్ సినిమానే ఆ స్థాయిలో కలెక్షన్లు కురిపిస్తే.. ఇక మెగాస్టార్ 150వ సినిమా ఏ స్థాయిలో కలెక్ట్ చేయాలి? ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ ఆకాశమంత ఎత్తుకు వెళ్తే.. మెగాస్టార్-రాజమౌళి కాంబినేషన్ విశ్వాంతారాలకు వెళ్తుంది. ఇంకే డైరెక్టర్ అయినా చిరు 150 భూమ్మేదే ఉంటుంది’’ అంటూ వర్మ ట్వీట్లు గుప్పించాడు. ఇంతటితో ఆగకుండా చిరు 150వ సినిమాను బాహుబలి-2కు పోటీగా తేవాలంటూ మెగా ఫ్యాన్స్ డిమాండ్ మొదలుపెట్టాలని కొసమెరుపు లాంటి ఇంకో ట్వీట్ కూడా చేశాడు వర్మ. మరి వర్మ అభిప్రాయం ప్రకారం చిరు 150వ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించడం.. ఆ సినిమాతో పాటు బాహుబలి-2 ఒకేసారి విడుదల కావడం ఎలా సాధ్యమబ్బా? వర్మ పెద్ద లాజిక్ మిస్సయినట్లున్నాడే..
జులై 17న రావాల్సిన శ్రీమంతుడు సినిమాను ఆగస్టు 7కు వాయిదా వేస్తే బాహుబలి సినిమాను చూసి మహేష్ భయపడ్డాడా అంటూ కొందరు సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మీడియా ముందు వినమ్రంగా.. ‘‘బాహుబలి మనందరికీ గర్వకారణం. అలాంటి సినిమా బాగా ఆడాలి. దానికి మూణ్నాలు వారాలు అవకాశం ఉండాలనే మా సినిమా వాయిదా వేసుకున్నాం’’ అని ఏమాత్రం భేషజం లేకుండా మాట్లాడి తనపై సెటైర్లు వేసిన జనాలు తలదించుకునేలా చేశాడు మహేష్. బాహుబలి బాగా ఆడాలని అప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రిన్స్.. ఇప్పుడు బాహుబలి సాధించిన విజయం చూసి కూడా అంతే సంతోషిస్తున్నాడు. బాహుబలి విడుదలైన టైంలో ఇండియాలో లేని మహేష్.. ఇప్పుడే హైదరాబాదుకు వచ్చి.. బాహుబలి గురించి వరుసగా ట్వీట్లు గుప్పించాడు. ఆ ట్వీట్లలో అతనేమన్నాడో చూడండి.
‘‘ఇప్పుడే స్విట్జర్లాండ్ నుంచి వచ్చా. బాహుబలి మాయాజాలం చూసి ఆశ్చర్యపోయా’’
‘‘ఓ తెలుగు సినిమా దేశంలో ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటనీ బద్దలు కొడుతుందని ఎన్నడూ ఊహించలేదు. చాలా గర్వంగా ఉంది’’
‘‘రాజమౌళి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాడైనందుకు గర్విస్తున్నా’’
‘‘నమ్మశక్యం కాని బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన కీరవాణి గారిని చూసి గర్విస్తున్నా’’
‘‘ఇలాంటి కళాఖండాన్ని నిర్మించిన ఆర్కా మీడియాను చూసి గర్విస్తున్నా’’
‘‘ప్రభాస్, రానా అద్భుతంగా చేశారు. వారి కష్టానికి, నిబద్ధతకు ఫలితం దక్కింది’’
‘‘అద్భుతమైన మీ టీం అందరికీ అభినందనలు’’