Begin typing your search above and press return to search.

మ్యాగీ మీద సినిమాగానీ తీస్తాడా?

By:  Tupaki Desk   |   12 Jun 2015 7:53 AM GMT
మ్యాగీ మీద సినిమాగానీ తీస్తాడా?
X
ఆ మధ్య ఐస్‌క్రీమ్‌ మీద సినిమా తీసి జనాల బుర్రలు మొద్దుబారిపోయేలా చేశాడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడాయన తీరు చూస్తుంటే మ్యాగీ మీద ఏదైనా హార్రర్‌ సినిమా తీస్తాడేమో అనిపిస్తోంది. కావాలంటే మ్యాగీ మీద ఇంత రచ్చ రచ్చ జరుగుతున్న సమయంలో ఆబగా మ్యాగీని ఆరగించేస్తున్న వర్మ ఫొటోను ఒక్కసారి చూడండి. ఓవైపు మ్యాగీని చూస్తుంటే వచ్చే భయం.. మరోవైపు వర్మ ఆరగిస్తున్న తీరు చూస్తే వచ్చే భయం.. రెండూ కలగలిస్తే ఇంతకంటే పెద్ద హార్రర్‌ సినిమా ఇంకేముంటుంది చెప్పండి?

నలుగురూ నడిచే దారిలో తానెప్పుడూ నడవనని చాలాసార్లు చాటుకున్న వర్మ.. మ్యాగీ విషయంలోనూ అదే చేస్తున్నాడు. మ్యాగీ మీద నిషేధం పడగానే.. తిరుమల లడ్డూను టెస్ట్‌ చేశారా? చేపల మార్కెట్‌ను పరీక్షించారా? అంటూ లాజిక్కులు తీసిన వర్మ.. ఇప్పుడు ఏకంగా మ్యాగీని ఆరగిస్తున్న ఫొటో ఒకటి పెట్టి తనదైన శైలిలో ట్వీట్లు చేశాడు. ''నాకు మ్యాగీని మించిన ఆనందాన్ని ఏదీ ఇవ్వదు. మ్యాగీ తినకుండా ఉండటం కంటే చావే మంచిది. నేను బతికున్నదే మ్యాగీ తినడానికి. ఒకవేళ నేను మ్యాగీ తిని చనిపోతే.. నా అంత్యక్రియలకు మ్యాగీ మాత్రమే రావాలనేది నా చివరి కోరిక. మ్యాగీని నిషేధించేవాళ్లు నాకు ఏమీ ఇవ్వలేదు'' అంటూ వేదాంతం వల్లించాడు వర్మ.