Begin typing your search above and press return to search.

‘అర్జున్ రెడ్డి’ గురించి వర్మ ఏమన్నాడంటే..

By:  Tupaki Desk   |   23 Aug 2017 4:12 AM GMT
‘అర్జున్ రెడ్డి’ గురించి వర్మ ఏమన్నాడంటే..
X
రామ్ గోపాల్ వర్మ మాటలు ఎంత రెవల్యూషనరీగా ఉంటాయో.. ఆయన కెరీర్ ఆరంభంలో తీసిన సినిమాలు ఎంత సెన్సేషనల్ గా ఉండేవో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న ‘అర్జున్ రెడ్డి’ టీజర్.. ట్రైలర్ చూస్తే అందులో కొంత మేర రామ్ గోపాల్ వర్మ ఆలోచనల స్ఫూర్తి కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. అందులోనూ మొన్న ‘అర్జున్ రెడ్డి’ ఆడియో వేడుకలో హీరో విజయ్ దేవరకొండ స్పీచ్ చూసినా.. అతడి మీద రామ్ గోపాల్ వర్మ ప్రభావం చాలా ఉందేమో అనిపించి ఉంటుంది. ‘ఎఫ్’ వర్డ్స్ వాడటం.. బూతులు కట్ చేసినందుకు సెన్సార్ బోర్డును టార్గెట్ చేయడం.. మిగతా అతడి ప్రసంగమంతా కూడా రామ్ గోపాల్ వర్మ స్టయిల్ కనిపించిన మాట వాస్తవం.

ఐతే తనకు బాగా నచ్చే స్టయిల్లో ఉన్న ‘అర్జున్ రెడ్డి’ టీజర్ - ట్రైలర్ల గురించి ఇన్నాళ్లూ ఏమీ మాట్లాడని వర్మ.. చాలా ఆలస్యంగా లైన్లోకి వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్ గురించి ఆయన స్పందించాడు. ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ అద్భుతంగా ఉందన్న వర్మ.. విజయ్ చాలా విషయాల్లో తనను తలపిస్తున్నాడని.. ఐతే తాను చావకుండానే అతను ఎలా పుట్టాడో అర్థం కావడం లేదని తనదైన శైలిలో ప్రశ్నించాడు. దీనికి విజయ్ బదులిస్తూ.. ‘‘సార్.. మీరు పుట్టకముందే నేను పుట్టడమే కాదు.. మీరు శివ తీసిన 1989వ సంవత్సరంలోనే నేను పుట్టాను’’ అంటూ బదులిచ్చాడు. మరోవైపు ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్లను చించేయించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును వర్మ టార్గెట్ చేసుకున్నాడు. వీహెచ్ పోస్టర్లు చించినట్లే.. విజయ్ ఆయన చొక్కాను చించాలని పిలుపునిచ్చాడు. ఈ పోస్టర్లలో తప్పేముందే మనవళ్లు.. మనవరాళ్లను వీహెచ్ అడగాలని వర్మ అన్నాడు. విజయ్ దేవరకొండ వీహెచ్ ను సంబోధించిన తరహాలోనే ‘తాతయ్యా’ అంటూ వీహెచ్ ను వర్మ సంబోధించడం విశేషం.