Begin typing your search above and press return to search.

రాత్రికి రాత్రే విజయవాడలో హోర్డింగులు

By:  Tupaki Desk   |   26 Feb 2016 11:27 AM GMT
రాత్రికి రాత్రే విజయవాడలో హోర్డింగులు
X
విజయవాడలో ఇప్పుడు వర్మ హాట్ టాపిక్. వంగవీటి టైటిల్ తో సినిమా తీస్తున్నప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుకుంటున్నా.. విజయవాడ వస్తున్నా అంటూ వర్మ టికెట్ డీటైల్స్ - హోటల్ వివరాలతో కూడా పబ్లిష్ చేసిన విషయం తెలిసిందే. బెజవాడలో తనను బెదిరిస్తున్న రౌడీలకు కౌంటర్ సవాల్ అంటూ చెప్పి మరీ వస్తున్న వర్మకు స్వాగతం పలుకుతూ విజయవాడ అంతా హోర్డింగులు కనిపిస్తున్నాయి.

'వంగవీటి అంటూ సంచలన చిత్రాన్ని తీస్తున్న మా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు స్వాగతం, సుస్వాగతం'.. ఇదీ ఆ హార్డింగుల్లో ఉన్న కంటెంట్. ఇప్పుడు విజయవాడంతా ఈ హోర్డింగులు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం వరకూ లేని ఈ హోర్డింగులు - ఫ్లెక్సీలు రాత్రికి రాత్రే వెలిశాయి. ఇంతగా వర్మని అభిమానిస్తూ సిటీ అంతా హోర్డింగులు పెట్టిందెవరో పైకి చెప్పలేం కానీ.. ఇప్పుడు వీటి గురించే బెజవాడ జనాలు మాట్లాడుకుంటున్నారు. వంగవీటి సినిమా తీయడం కోసం కొందరిని ప్రత్యేకంగా కలిసేందుకే వర్మ ఈ టూర్ పెట్టుకున్నాడు.

రాజకీయ విమర్శలు, రౌడీల బెదిరింపులను లెక్క చేయకుండా వంగవీటి రాధా - రంగా - చలసాని వెంకటరత్నంలకు సంబంధించిన స్టోరీని ఎలాగైనా తెరకెక్కించి తీరతానని వర్మ ఇప్పటికే శపథం చేశాడు. అలాగే ఫిబ్రవరి 26న విజయవాడకి వస్తున్నానన్నాడు. ఈ ఫ్లెక్సీలకు, వర్మ రాకకు.. బెదిరించిన వాళ్ల రియాక్షన్ ఎలా ఉండనుందో చూడాలి.